‘ప్యారడిమ్ షిఫ్ట్’.. చేస్తుంది ఇంటిని సినిమా ధియోటర్!!

Posted By: Staff

‘ప్యారడిమ్ షిఫ్ట్’.. చేస్తుంది ఇంటిని సినిమా ధియోటర్!!

‘‘డిజిటల్ సౌండ్ అనుభూతితో ఒళ్లు గగుర్పాటుకు లోను చేసే సన్నివేశాలను ఇక ఇంట్లోనే చూడొచ్చు.. 70mmధియోటర్ లో పొందిన సౌండ్ అనుభూతిని ఇక మీ బెడ్ రూమ్ లోని పొందవచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంటిల్లిపాది ఇక పై డ్రాయింగ్ టీవి గదిలో కూర్చుని ధియోటర్ అనుభూతితో సినిమాలను వీక్షించవచ్చు.’’

ప్రఖ్యాత మ్యూజిక్ స్పీకర్ల కంపెనీ ‘ప్యారడిమ్ షిఫ్ట్’(Paradigm)సరికొత్త హోమ్ ధియటర్ స్పీకర్ సిస్టమ్ లను మార్కెట్లో విడుదల చేసింది. 100 CT,200 CT,400 CT వర్షన్లలో విడుదలైన ఈ సినిమా స్పీకర్లు మీ ఇంటినే సినిమా ధియోటర్ లా మార్చేస్తాయి. ఈ స్పీకర్లను ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. క్రిస్టల్ క్లారిటీ సౌండ్ ను ఈ గ్యాడ్జెట్ విడుదల చేస్తుంది. ఈ వ్యవస్థ సౌలభ్యంతో, నటీనటులు ‘డైలాగ్’లను రియాలిటీగా విన్న అనుభూతికి మీరు లోనవుతారు.


స్పీకర్లలోని టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే, అత్యాధునిక ‘S-PAL’టెక్నాలజీని ఈ స్పీకర్ వ్యవస్థలో ప్రవేశపెట్టారు. ‘ఫెర్రో ఫ్లూయిడ్ కూలింగ్’ సామర్ధ్యాన్ని స్పీకర్లలో ప్రవేశపెట్టారు. ఈ కూలింగ్ వ్యవస్థ ‘హై పవర్ విద్యుత్ షాక్ ల’నుంచి స్పీకర్లను రక్షిస్తుంది. పటిష్ట యాంఫ్లీఫైయర్ వ్యవస్థ రెండు ఇన్ పుట్ లైన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.


ఉన్నత ప్రమాణాలో రూపొందించబడిని ఈ సౌండ్ ధియోటర్ సిస్టమ్ నాణ్యమైన క్రిస్టల్ ఆడియోను శ్రోతకు అందిస్తుంది. ఇంట్లోనే సినిమా అనుభూతులను స్వాదించాలనుకునే సంగీత ప్రేమికులకు ‘100 CT’హోమ్ ధియోటర్ వ్యవస్థ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. రిటైల్ స్టోర్లలో రూ.50.000 చెల్లించి ఈ హోమ్ ధియోటర్ ను సొంతం చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting