ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇంట్లో ఉంటే రచ్చ రచ్చే...

Posted By: Super

ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇంట్లో ఉంటే రచ్చ రచ్చే...

ఇంటర్నేషనల్ మ్యూజిక్ డివైజ్ తయారీదారు అయిన ప్యారడైమ్ ఎలక్ట్రానిక్స్ ఇండియాలోని మ్యూజిక్ అభిమానుల కోసం కొత్త స్పీకర్ సిస్టమ్‌ ప్రవేశపెట్టనుంది.ప్యారడైమ్ ఎలక్ట్రానిక్స్ ఇండియాలో విడుదల చేయనున్న ఆ మ్యూజిక్ సిస్టమ్ పేరు ప్యారడైమ్ షిప్ట్. ఈ మ్యూజిక్ సిస్టమ్‌తో పాటు కెనడాలో రూపోందించిన పవర్ స్పీకర్స్‌తోపాటు మూడు ఇయర్ బడ్స్‌ని కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ప్యారడైమ్ ఎలక్ట్రానిక్స్ విడుదల చేయనున్నఈ పవర్ స్పీకర్ పేరు యాక్టివ్ ఆటమ్(A2). ఆ మూడు ఇయర్ బడ్స్ పేర్లు వరుసగా E1, E2m, E3m. యాక్టివ్ ఆటమ్(A2) చూడడానికి అందంగా ఉండి టేబుల్ టాప్ మాదరే ఉంటుంది. ఐప్యాడ్ స్టీరియో పెయిర్స్ మాదిరి దీనిని కూడా ఎడమ లేదా కుడి స్టీరియో సిస్టమ్స్‌గా వాడో్చ్చు. వీటితోపాటు మనం ఇంట్లో ఉపయోగించే గిటార్స్, కీబోర్డ్స్, టెలివిజన్స్, హోం డిజె డెక్స్, డెస్క్ టాప్ కంప్యూటర్స్‌కు స్టీరియో స్పీకర్స్గ్‌గా కూడా ఉపయోగించవచ్చు. యాక్టివ్ ఆటమ్(A2)ని స్పీకర్స్‌ని కనెక్ట్ చేసేందుకు గాను 3.5mm ఆడియో జాక్ లేదా ఆర్ సిఎ అవుట్ పుట్‌ని వాడోచ్చు.

యాపిల్ ఎయిర్ ప్లే మాదరే ఈ స్టీరియో సిస్టమ్ కూడా మీయొక్క స్ట్రీమ్స్‌ని, వైర్ లెస్ మ్యూజిక్ మాదిరే అందిస్తాయి. ఫెర్పామెన్స్ విషయానికి వస్తే యాక్టివ్ ఆటమ్(A2) ఇంట్లో 100w పవర్ మ్యూజిక్‌ని ఇవ్వడం వల్ల ఇల్లు మొత్తం పవర్ హౌస్‌గా మారిపోతుంది. ఇక ఇయర్ బడ్స్ విషయానికి వస్తే పర్సనల్ గా మ్యూజిక్‌ని ఎంజాయ్ చేసేవారికోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి. ఈ ఇయర్ బడ్స్ అందించే క్వాలిటీ నిజంగా యూజర్స్‌ని ఒక ఊహాలోకంలోకి తీసుకొని వెళతాయి.

ప్యారడైమ్ విడుదల చేసిన మూడు రకాల ఇయర్ బడ్స్ బ్లాక్ అండ్ వైట్ ఫినిష్‌తోటి యాజర్స్‌కు ఎటువంటి నాయిస్‌ని దరిచేరనీయకుండా సీల్‌తో అద్బుతంగా రూపోందించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇయర్ బడ్స్ అన్ని రకాల సైజులకు సంబంధించిన చెవులకు సరిగ్గా సరిపోయేందుకు 1.2cm కార్డ్ అందులోనిక్షిప్తం చేయడం జరిగింది. ఇక E2m, E3m మోడల్స్ విషయానికి వస్తే ఇందులో ఉన్న మైక్రో ఫోన్, ఇన్ లైన్ రిమోట్ సహాయంతో యూజర్స్‌ ఎప్పుడైనా మ్యూజిక్‌ని వింటున్నప్పడు కాల్ వస్తే ఆ ప్రస్తుత ట్రాక్ మ్యూజిక్‌ని పాజ్‌లో పెట్టి కాల్ మాట్లాడిన తర్వాత ప్లే బటన్ నొక్కి మీపాటను కంటిన్యూ చేసే విధంగా రూపోందించడం జరిగింది.

ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల చేయనున్న ఈ పవర్ స్పీకర్ యాక్టివ్ ఆటమ్(A2), ఇయర్ బడ్స్ E1, E2m, E3mకి సంబంధించిన ధరను ఇంకా మార్కెట్లో వెలువడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot