కుర్ర జోరు కోసం ‘ఆండ్రాయిడ్’ మ్యూజిక్ ప్లేయర్ ...!!

సాంకేతక మరియు ఎలక్ట్రానిక్ వస్తు ప్రపంచలో మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో అధునిక టెక్నాలజీకి ప్రాధాన్యమిస్తూ ‘ఫిలిప్స్’ సరికొత్త ఆడియో పరికరాలను వినియోగదారులకు అదించనుంది. ‘గో గేర్ లైన్’ పేరుతో ఈ బ్రాండ్ వస్తవులను విడుదల చేయునుంది.
ఆండ్రాయిడ్ ఆధారితంగా రూపుదిద్దుకున్న మీడియో ప్లేయర్‌కు ‘గో గేర్ కనెక్టు 3’గా నామకరణం చేశారు. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా రూపుదిద్దుకున్న ఈ పరికరంలో అత్యాధునిక వై - ఫై వ్యవస్థ వేగవంతమైన ఇంటర్నెట్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. ఈ సరికొత్త గ్యాడ్జెట్‌లో పొందుపరిచిన అపడేటడ్ ఫీచర్లతో ఆన్‌లైన్ ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా వందల ఆప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ డివైజులోని ఇతర ఫీచర్లను పరిశీలిస్తే 3.2 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే 720 పిక్సల్ సామర్ధ్యం గల వీడియోలను మీకు అందిస్తుంది. ప్లేయర్‌లో పొందుపరిచిన సౌండ్ టెక్నాలజీ నాణ్యమైన వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ పరికరంలో ఫిలిప్స్ సాంగ్ బ్రిడ్ సాఫ్ట్ వేర్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
గ్యాడ్జెట్‌లో అమర్చిన ‘లైక్ మ్యూజిక్’ బటన్‌ను ప్రెస్ చేస్తే ఫేవరెట్ మ్యూజిక్ ఫైళ్లతో పాటు మ్యూజిక్ లైబ్రరీ వంటి అంశాలు ఆవిష్కృతమువుతాయి. ‘డీఎల్‌న్‌ఏ’ సౌలభ్యతను ఈ పరికరంలో ఏర్పాటు చేశారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ మీడియా ప్లేయర్ విడుదలతో పాటు ధరకు సంబంధించిన అంశాలను యాజమాన్యం గోప్యంగా ఉంచింది.


Click it and Unblock the Notifications