ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..?

Posted By: Prashanth

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..?

 

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..?, అయితే ఫిలిప్స్ కంపెనీ రూపొందించిన  ఫ్లెక్సీ డాక్ స్పీకర్ల గురించి తెలుసుకోవల్సిందే. బ్లూటూత్ ప్రత్యేకతతో తయారుకాబడిన ఈ స్పీకర్ల మోడల్ నెంబరు ఏఎస్111(AS111).డాక్ సపోర్ట్‌తో మొబైల్‌లోని మ్యూజిక్ వినటంతో పాటు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్ ఉత్ఫత్తి చేసే సౌండ్ 360డిగ్రీలు వ్యాప్తిచెందుతుంది. లెడ్ డిస్ప్లేతో ఈ అధిక ముగింపు స్పీకర్‌ను తయారు చేశారు.  స్టీరియో ఎఫ్ఎమ్, ఆలారం క్లాక్ వంటి అదనపు ప్రత్యేకతలు ఈ స్పీకర్లో ఒదిగి ఉన్నాయి. ధర రూ.5,999.

టీవీ ఆనై ఉంటుంది.. సౌండ్ మీ ఒక్కరికే వినిపిస్తుంది!!!

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా శబ్ధాలను నేరుగా మీరు మాత్రమే వినేందుకు గాను ‘ఫిలిప్స్’ సరికొత్త హెడ్‌ఫోన్ ను డిజైన్ చేసింది. ‘SHC 1300’ వేరియంట్‌లో రూపుదిద్దుకున్న ఈ ఆడియో గ్యాడ్జెట్ ట్రాన్సిమిటర్ ఆధారితంగా సౌండ్ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకుంటుంది.

పని విధానం:

12 వోల్ట్ సామర్ధ్యం గల డీసీ ఆడాప్టర్ నుంచి ట్రాన్సిమిటర్‌కు పవర్ అందిన తరువాత టీవి ఆడియో అవుట్‌కు జతచేయాలి. హెడ్‌ఫోన్ ఆన్ చేయగానే ట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రసరించే సౌండ్ సిగ్నల్స్ నేరుగా మీ చెవులకు చేరతాయి. ట్రాన్స్‌మిటర్ సిగ్నల్ సాంధ్రత 7 మీటర్లు.

హెడ్‌ఫోన్‌లలో రెండు AAA బ్యాటరీలను అమర్చాల్సి ఉంటుంది. డివైజ్ ఇయర్ కప్‌లు సున్నితత్వాన్ని కలిగి సౌకర్యవంమతైన సౌండ్ అనుభూతికిలోను చేస్తాయి. ఈ ఆడియో గ్యాడ్జెట్‌ను ధరించి సుప్రీమ్ సౌండ్ క్వాలిటీని శ్రోత ఆస్వాదించవచ్చు. మిడ్‌నైట్ టీవీ కార్యక్రమాన్ని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఏంజాయ్ చెయ్యచ్చు. ఇండియన్ మార్కెట్లో ‘ఫిలిప్స్ SHC 1300’ హెడ్‌ఫోన్స్ ధర రూ.2000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot