‘ఫిలిప్స్ ఫిడిలో’ ఆండ్రాయిడ్ ఆడియో డాక్ సిస్టమ్..!!

ప్రత్యేక డిజైనింగ్ ఫీచర్లతో ఈ డాక్ వ్యవస్థను రూపొందించారు. ఆఫీస్, బెడ్‌రూమ్ తదితర ప్రదేశాల్లో ఈ డాక్ స్పీకర్లను అమర్చుకుని వినసొంపైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ స్పీకర్ డాక్ సిస్టమ్ సంబంధిత ఆప్లికేషన్లను ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. సంబంధిత ఆప్లికేషన్లను ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డాక్ సిస్టమ్ ప్యాకేజీలో పొందుపరిచే ‘QR’ కోడ్ ప్రక్రియ ద్వారా ఈ డౌన్‌లోడింగ్ విధానం సాధ్యమవతుంది. మీ స్మార్ట్ ఫోన్‌లో ‘QR’ రీడర్ లేని పక్షంలో ‘ఫిలిప్స్ ఫిడిలో’ పేరుతో ఆండ్రాయిడ్ మార్కెట్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది.
భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కాబోతున్న ‘ఫిలిప్స్ ఫిడిలో ఆండ్రాయడ్ ఆడియో డాక్’ (Philips Fidelio Android Audio dock) ధర రూ.8,000 ఉంటుంది.


Click it and Unblock the Notifications








