మిడ్‌నైట్ టీవీని ఫిలిప్స్ హెడ్‌ఫోన్‌తో ఏంజాయ్ చేయండి!!!

Posted By: Staff

మిడ్‌నైట్ టీవీని ఫిలిప్స్ హెడ్‌ఫోన్‌తో ఏంజాయ్ చేయండి!!!

 

ఆధునిక మనిషి దైనందిన జీవితంలో ఆడియో హెడ్‌ఫోన్‌లు ఓ భాగమైన విషయం తెలిసిందే. మన్నికైన హెడ్‌ఫోన్‌లు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆడియో పరికరాల ఉత్పాదక రంగంలో దశాబ్దాల కాలంగా సేవలందిస్తున్న ఫిలిప్స్ కొత్త సంస్కరణకు తెర లేపింది.

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా శబ్ధాలను నేరుగా మీరు మాత్రమే వినేందుకు గాను ‘ఫిలిప్స్’డిజైన్ సరికొత్త హెడ్‌ఫోన్ దోహదపడుతుంది. ‘SHC 1300’ వేరియంట్‌లో రూపుదిద్దుకున్న ఈ ఆడియో గ్యాడ్జెట్ ట్రాన్సిమిటర్ ఆధారితంగా సౌండ్ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకుంటుంది.

పని విధానం:

12 వోల్ట్ సామర్ధ్యం గల డీసీ ఆడాప్టర్ నుంచి ట్రాన్సిమిటర్‌కు పవర్ అందిన తరువాత టీవి ఆడియో అవుట్‌కు జతచేయాలి. హెడ్‌ఫోన్ ఆన్ చేయగానే ట్రాన్స్‌మిటర్ ద్వారా ప్రసరించే సౌండ్ సిగ్నల్స్ నేరుగా మీ చెవులకు చేరతాయి. టీవీ వాల్యుమ్ మ్యూట్‌లో పెట్టినప్పటికి సౌండ్‌ను పూర్తి స్ధాయిలో ఆస్వాదించగలుగుతారు. ట్రాన్స్‌మిటర్ సిగ్నల్ సాంధ్రత 7 మీటర్లు.

హెడ్‌ఫోన్‌లలో రెండు AAA బ్యాటరీలను అమర్చాల్సి ఉంటుంది. డివైజ్ ఇయర్ కప్‌లు సున్నితత్వాన్ని కలిగి సౌకర్యవంమతైన సౌండ్ అనుభూతికి లోను చేస్తాయి. ఈ ఆడియో గ్యాడ్జెట్‌ను ధరించి సుప్రీమ్ సౌండ్ క్వాలిటీని శ్రోత ఆస్వాదించవచ్చు. మిడ్‌నైట్ టీవీ కార్యక్రమాన్ని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఏంజాయ్ చేయ్యేచ్చు. ఇండియన్ మార్కెట్లో ‘ఫిలిప్స్ SHC 1300’ హెడ్ ఫోన్స్ ధర రూ.2000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting