‘పైనీర్’ డీజే మిక్సర్..ఇప్పుడు కొత్త రేంజ్‌లో..!!

మిక్సర్‌లో ఏర్పాటు చేసిన ఛానెల్ ఫిల్టర్ ఫీచర్, క్రాస్ ఫేడర్ యుటిలటీ వివిధ వేరియేషన్లలో సౌండ్‌లను మిక్స్ చేస్తాయి. పొందుపరిచిన ట్విన్ సౌండ్ కలర్ ఫిల్టర్ వ్యవస్థ సౌండ్ నియంత్రణకు దోహడపడుతుంది.
‘ట్విన్ సౌండ్ కలర్ ఫిల్టర్’వ్యవస్థ బాసెస్(basses)ను హైపిచ్ నుంచి, లో పిచ్ లోకి మార్చేందుకు సహకరిస్తుంది. ‘క్లారిటీ మిస్ కానివ్వకుండా సౌండ్ క్వాలిటీని’ ఈ మిక్సర్ అందిస్తుంది. మిక్సర్ వెనుకభాగంలో ‘XLR అవుట్ పోర్టులను’ ఏర్పాటు చేశారు. ఈ అవుట్ పోర్టుల ద్వారా ఇతర ఆడియో వ్యవస్థలకు మిక్సర్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
‘ఐపాడ్’ వంటి ఆడియో డివైజ్‌లకు ఈ మిక్సర్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. 24బిట్ డిజిటల్ సౌండ్ ప్రొసెసింగ్ వ్యవస్థ నాణ్యమైన మిక్స్ సౌండ్ అనుభూతిని శ్రోతకు కలిగిస్తుంది. చివరిగా ధర అంశానికి వస్తే ‘పైనీర్ DJM 250’ ధర ఇండియన్ మార్కెట్లో రూ.20,000 ఉంటుంది.


Click it and Unblock the Notifications