సంవత్సరం వారంటీతో ‘పైనీర్’ అద్భుత ఆఫర్..!!

Posted By: Staff

సంవత్సరం వారంటీతో ‘పైనీర్’ అద్భుత ఆఫర్..!!

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘పైనీర్’ తమ సరికొత్త కూల్ టెక్నాలజీ వ్యవస్ధతో ‘ఎయిర్ ప్లే మల్టీ - రూమ్ సౌండ్’ సిస్టమ్‌లను మార్కెట్లో విడుదల చేయునుంది. వైర్‌లెస్ వ్యవస్ధ ఆధారితంగా రూపుదిద్దుకున్న ‘పైనీర్ X-SMC3-K’, ‘పైనీర్ X-SMC5-K’ వేరియంట్లు అత్యాధునిక సౌండ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి.

వై-ఫై (WiFi) కంపేటీబులుటీ, డీఎల్ఎన్ఏ(DLNA) కనెక్టువిటీ, ఆపిల్ ఎయిర్ ప్లే స్ట్రీమింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలను ఈ సౌండ్ సిస్టమ్‌లలో పొందుపరిచారు. ఎడిషనల్ ఆడాప్టర్ సాయంతో ‘వీ’ ట్యూనర్ ఇంటర్నెట్ రేడియో, బ్లూటూత్ స్ట్రీమింగ్ వంటి సౌలభ్యతలను పొందవచ్చు. ఐపాడ్, ఐఫోన్ డాకింగ్ స్టేషన్లను సౌండ్ సిస్టమ్‌లో ఏర్పాటు చేశారు.

‘X-SMC5-K’ వేరియంట్‌లో రూపుదిద్దుకున్న సౌండ్ సిస్టమ్‌లో ‘డీవీడీ ప్లేయర్’తో పాటు హై డెఫినిషన్ టీవీకి అనుసంధానం చేసుకునే విధంగా హెచ్‌డిఎమ్ఐ అవుట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ గ్యాడ్జెట్ల సౌండ్ వ్యవస్థలో భాగంగా పొందుపరిచిన ‘టూ ఛానల్ డిజిటల్ యాఫ్లీపైయిర్’ వినసొంపై ఆడియోను శ్రోతకు అందిస్తుంది. సౌండ్ సిస్టమ్‌లలో ఏర్పాటు చేసిన 2.5 అంగుళాల స్లీక్ ఎల్‌సీడీ కలర్ డిస్‌ప్లే, రన్ అవుతున్న మ్యాజిక్ ఫైల్ సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది.
సిస్టమ్‌లో అనుసంధానించిన ప్రత్యేక ఎఫ్ఎమ్ రేడియో సమచార వ్యవస్ధను మరింత పటిష్టితం చేస్తుంది.

‘X-SMC3-K’ మోడల్ సౌండ్ సిస్టమ్‌లో 4 ప్యాసివ్ రేడియేటర్లను అనుసంధానించగా, ‘X-SMC5-K’లో రెండు ప్యాసివ్ రేడియోటర్లను మాత్రమే అనుసంధానించారు. బరువు విషయానికొస్తే ‘X-SMC5-K’ సౌండ్ సిస్టమ్ కేవలం 2 కేజీ బరువు మాత్రమే ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ఆధారితంగా ఈ సౌండ్ సిస్టమ్ లను నియంత్రించుకోవచ్చు. 3.5 mm ఆడియో జాక్ వ్యవస్ధ ద్వారా సౌండ్ సిస్ట్‌మ్‌లను హెడ్ ఫోన్లకు జత చేసుకోవచ్చు.

తక్కువ విద్యుత్‌ను కన్స్యూమ్ చేసుకునే ఈ సౌండ్ సిస్టమ్‌లు సంవత్సరం వారంటీతో ఈ అక్టోబర్‌లో విడుదల కానున్నాయి. ధరలను పరిశీలిస్తే ‘X-SMC3-K’ రూ. 19,500, ‘X-SMC5-K’ రూ.22,000కు లభ్యమవునున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot