కిక్ ఎక్కించే 'పయనీర్ మైక్రో స్టీరియో సిస్టమ్'

Posted By: Super

కిక్ ఎక్కించే 'పయనీర్ మైక్రో స్టీరియో సిస్టమ్'

పయనీర్ కంపెనీ విడుదల చేస్తున్న ఆడియో సిస్టమ్స్‌ని కొంత మంది కస్టమర్స్ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఇండియన్ మార్కెట్‌తో పొల్చుకుంటే యూరోపియన్ మార్కెట్ జనాభా చాలా అదృష్టవంతులు. అందుకు కారణం ఇటీవలే యూరప్ మార్కెట్లో పయనీర్ కంపెనీకి చెందిన నాలుగు మైక్రో స్టీరియో సిస్టమ్స్‌ని ప్రవేశపెట్టారు. మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగు స్టీరియో సిస్టమ్స్ కూడా చక్కని ఆఫర్స్‌తో విడుదలవ్వడమే కాకుండా ఫెర్పామెన్స్ కూడా సూపర్బ్‌గా ఉందని మ్యూజిక్ అభిమానులు కొనియాడుతున్నారు.

పయనీర్ విడుదల చేసిన ఈ నాలుగు స్టీరియో సిస్టమ్స్ పేర్లు వరుసగా X-HM10, X-HM20DAB, X-HM70DAB, XC-HM70DAB. ఈ నాలుగు స్టీరియో సిస్టమ్స్‌ని తయారుచేసింది పయనీర్ కంపెనీలో మోస్ట్ సక్సెస్ పుల్ మ్యూజిక్ సిస్టమ్‌గా పేరోందిన X-HM50 మోడల్ మైక్రో సిస్టమ్ నుండి రూపోందించడం జరిగింది. పయనీర్ కంపెనీ X-HM50 మ్యూజిక్ సిస్టమ్‌ని పోయిన సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలైన ఈ నాలుగు స్టీరియో సిస్టమ్స్‌తో పాటు యుఎస్‌బి పోర్ట్స్, ప్లేబ్యాక్ ట్రాక్స్, యుఎస్‌బి స్టోరేజి డివైజెస్ ప్రత్యేకం. వీటిల్లో రూపోందించిన యుఎస్‌బి పోర్ట్స్ స్టీరియో సిస్టమ్స్‌తో తయారు చేయబడినవి.

విడుదలైన నాలుగు స్టీరియో సిస్టమ్స్‌లలో X-HM10 సిస్టమ్‌కి తప్ప మిగిలిన మూడు మోడల్స్‌లలో ఐప్యాడ్, ఐఫోన్‌లకు సంబంధించి డాక్స్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మైక్రో స్టీరియో సిస్టమ్స్ అన్ని కూడా ఒకే విధమైన సైజులో రూపోందించడం జిరిగింది. విడుదల చేసిన నాలుగు డివైజెస్ కూడా 21.5 cm వెడల్పుని కలిగి ఉన్నాయి. ఇక ఎత్తు విషయానికి వస్తే 9cm నుండి 11.1cm వరకు ఉన్నాయి. వీటిల్లో ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన X-HM10 సిస్టమ్‌లో 15 వాట్స్ పవర్ అవుట్ పుట్ ఇచ్చే రెండు స్పీకర్స్‌‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

X-HM20DAB విషయానికి వస్తే చూడడానికి కూల్‌గా ఉండి హై గ్రేడ్ స్పీకర్స్‌ని కలిగి ఉండి 10cm వూపర్ దీని సొంతం. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే DAB Radio కూడా ఇది డెలివరి చేస్తుంది. ఈ నాల్గింట్లో చెప్పుకోదగ్గ స్టీరియో సిస్టమ్ X-HM70DAB. ఇందులో ఇంటర్నెట్ రేడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లేబ్యాక్‌ని ఇంట్లో ఉన్న నెట్ వర్క్ ద్వారా చెక్ చూడొచ్చు. ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఈ స్టీరియో సిస్టమ్స్ ధరలు ఇలా ఉన్నాయి.

పయనీర్ X-HM10 -------- రూ 9,800/-

పయనీర్ X-HM20DAB------------- రూ 15,000/-

పయనీర్ X-HM70DAB---------- రూ 30,000/-

పయనీర్ XC-HM70DAB--------- రూ 24,000/-

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot