ప్లాంట్రానిక్స్ ఆడియో స్పీకర్లు.. ఆపిల్ పరికరాల కోసం..!!

Posted By: Super

ప్లాంట్రానిక్స్ ఆడియో స్పీకర్లు.. ఆపిల్ పరికరాల కోసం..!!


‘‘ఆడియో పరికరాల తయారీ రంగంలో ‘50 సంవత్సరాల’ సుదీర్ఘ అనుభవం.. అనుభవజ్ఞులైన యంత్రాంగం.. ఎన్నో లోటు పాట్లను చెవిచూసిన వైనం... అయినా విశ్వసనీయతే దిగ్గజ ‘ప్లాంట్రానిక్స్’ లక్ష్యం...’’

నమ్మకంతో కూడిన నాణ్యమైన ఆడియో గ్జాడ్జెట్లను వినియోగదారులకు చేరువచేస్తున్న ‘ప్లాంట్రానిక్స్’ (Plantronics) ఆధునిక ఆడియో పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది. ‘ఐఫోన్’ మరియు ‘మ్యాక్’ పరికరాల వాడకందారుల కోసం రూపుదిద్దుకున్న ఈ ‘ఆడియో హెడ్‌సెట్’ బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది.

‘Plantronics Voyager Pro UC’ వర్షన్లో విడుదలైన ఈ హెడ్‌సెట్లలో ‘టచ్ సెన్సార్ వ్యవస్థను పొందుపరిచారు. తద్వారా వినియోగదారుడు ఆటోమెటిక్ విధానం ద్వారా కాల్‌కు స్పందించవచ్చు. వాయిస్ యాక్టివేటెడ్ డైలింగ్ టెక్నాలజీని ఈ గ్యాడ్జెట్లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

కేవలం 17.6 గ్రాముల బరువుతో డిజైన్ కాబడ్డ ‘ప్లాంట్రానికస్ హెడ్‌సెట్’ స్పీకర్లలో ‘మినీ యూఎస్బీ ఆడాప్టర్’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అమర్చిన పటిష్ట మైక్రోఫోన్ వ్యవస్థ అంతారయం సమస్యలను నిరోధిస్తుంది. ఏర్పాటు చేసిన బ్యాటరీ వ్యవస్థ 6 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఛార్జింగ్ స్థాయిని తెలిపే విధంగా ఇండికేటర్ లైటింగ్ వ్యవస్థతో పాటు వాల్యుమ్‌ను నియంత్రించేందుకు వీలుగా బటన్లను హెడ్‌సెట్లలో ఏర్పాటు చేశారు. ఆడ్వాన్సడ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ప్లాంట్రానిక్స్ హెడ్‌సెట్లు రూ.8,500లకు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot