‘ఫ్లాంట్రానిక్స్’ ఇప్పుడు కొత్త కోణంలో..!!

Posted By: Super

‘ఫ్లాంట్రానిక్స్’ ఇప్పుడు కొత్త కోణంలో..!!

సంగీతాన్ని ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి.., ఆధునిక ఆడియో సాంకేతికతో కేవలం ఇంట్లోనూ , వీధులోనే కాదు ప్రయాణ సందర్భంలోనూ మైమరింపించే మ్యూజిక్ ను ప్రైవసీతో ఆస్వాదిస్తున్నాం. వైర్లకు స్వస్తి పలుకుతూ ఆవిర్భావమైన బ్లూటాత్ వ్యవస్థ సమాచార మాద్యమానికి మరింత దోహదపడుతుంది.

మన్నికైన ఆడియో పరికరాలను అందించటంలో దశాబ్దాల కాలంగా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ‘ప్లాంట్రానిక్స్’మరో ప్రయత్నంగా ‘బ్లూటూత్’ ఆధారిత హెడ్ సెట్ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసంది.

స్మార్ట్ ఫోన్ తదితర మ్యూజిక్ ప్లేయర్లకు ఈ డివైజ్ ను కనెక్టు చేసుకోవచ్చు. క్విక్ పార్ టెక్నాలజీ ని ఈ గ్యాడ్జెట్లో ప్రవేశపెట్టారు. హెడ్ సెట్లలో ఏర్పాటు చేసిన బ్యాటరీ వ్యవస్థ 16 గంటల పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన డిజిటల్ సిగ్నలింగ్ వ్యవస్థ అవాంతరాలు లేని ఆడియోను అందిస్తుంది.

స్టాటస్ అలర్ట్ ఫీచర్ ను గ్యాడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ అలర్ట్ ఛార్జింగ్ అయిపోతున్న సందర్భంలో మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇతర బ్లూటూత్ గ్యాడ్జెట్లతో ప్లాంట్రానిక్స్ అత్యుత్తమ పనితీరు కలిగి ఉంటుంది. భారతీయ ఆడియో గ్యాడ్జెట్ల స్టోర్లలో ‘ప్లాంట్రానిక్స్ M50’ హెడ్ సెట్ ధర రూ. 2,500 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot