పాకెట్ బూమ్ వైబ్రేషన్ స్పీకర్లు., ‘అంతా సౌండ్ మయం’!!

Posted By: Staff

పాకెట్ బూమ్ వైబ్రేషన్ స్పీకర్లు., ‘అంతా సౌండ్ మయం’!!

పాకెట్ బూబ్ వైబ్రేషన్ స్పీకర్లను నేల మీద, బల్ల మీద, డోర్ మీదా, గ్లాస్ మీదా ఇలా ఎక్కడైనా స్టాండ్ చేసి మ్యూజిక్ ఆన్ చేయండి. ఓ కొత్త రకం అనుభూతిని మీరు పొందుతారు, ఈ స్పీకర్లు విడుదల చేసే వైబ్రేషన్‌కు ఆ ప్రదేశంలో ఉన్న వస్తువుల మొత్తం స్పీకర్లలా పనిచేయటం మొదలు పెడతాయి.

క్షణాల్లో ఆకర్షించే ఈ స్పీకర్లు, మన్నికైన ఫీచర్లతో ఆకట్టుకునే రీతిలో డిజైన్ చేయుబడ్డాయి. రెండు AAA రీచార్జ్‌బుల్ బ్యాటరీలు విడుదల చేసే శక్తిలో ఈ స్పీకర్లు పనిచేస్తాయి. యూఎస్బీ కేబుల్ ఆధారితంగా బ్యాటరీలను రిఛార్జ్ చేసుకోవచ్చు.

వివిధ రంగుల్లో విడుదల కాబోతున్న, ఈ స్పీకర్లకు ‘3.5 ఆడియో జాక్’ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆడియో జాక్ సౌలభ్యతతో సెల్ ఫోన్లతో పాటు వివిధ మ్యాజిక్ ప్లేయర్లను జత చేసుకోవచ్చు. స్పీకర్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ‘స్టికీ ప్యాడ్’ ద్వారా స్పీకర్లను ఏ ప్రాంతంలోనైనా స్టాండ్ చేసుకోవచ్చు.

స్పీకర్లను ఏ ప్రదేశంలో ఉంచినా, సౌండ్ నాణ్యత విషయంలో ఎటువంటి ఆసౌకర్యానికి శ్రోత గురికాడు. అయితే స్పీకర్ల వెనక భాగంలో ఏర్పాటు చేసిన ‘స్టికీ ప్యాడ్’ను అప్పుడప్పుడు మార్చాల్సి వస్తుంది. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ స్పీకర్లు రూ. 2,300కు లభ్యమవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot