చెమట, తేమల నుంచి రక్షించేందుకు ‘వాచ్ బ్యాండ్’!!

Posted By: Staff

చెమట, తేమల నుంచి రక్షించేందుకు ‘వాచ్ బ్యాండ్’!!

 

చెమట, తేమ వంటి ధృవ పదార్ధాలు ఎలక్ట్ర్రానిక్, కంప్యూటింగ్ వస్తువులకు ప్రధాన శత్రువులు. ఈ ధృవ పదార్ధాలు కంప్యూంటిగ్ డివైజుల దరి చేరితే ఇట్టే నాశనమవుతాయి. ఈ సమస్య కారణంగా సాంకేతిక డివైజులకు రక్షణ కల్పించేందుకు వివిధ ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవల్సి వస్తుంది.

సమస్య పరిష్కారనికి చెక్ పెట్టే యోచనతో క్వాడ్ మౌంటెయిన్ సంస్థ ఐపోడ్ నానో పరికరానికి ‘వాచ్ బ్యాండ్’ను డిజైన్ చేసింది. రిస్ట్ వాచ్ ఆకృతిలో రూపొందించబడిన ఈ ‘వాచ్ బ్యాండ్’లో ఎటువంటి అరమరికలు లేకుండా ‘ఐపోడ్ నానో’ ఫిట్ అవుతుంది. మన్నికైన స్టెయిన్ లెస్ స్టీల్, సిలికాన్ పదార్థాలతో రూపుదిద్దుకున్న ‘వాచ్ బ్యాండ్’ రిస్ట్ వాచ్ బ్యాండ్ చెమట ఇతర తేమను గ్యాడ్జెట్ దరికి రాకుండా చేస్తుంది. అమర్చబడిన ఐపోడ్ నానోకు సక్రమంగా గాలి సరఫరా అయ్యేందుకుగాను సర్ధుబాటు రంధ్రాలను బ్యాండ్ లో ఏర్పాటు చేశారు. బ్యాండ్ నిర్మాణంలో ఉపయోగించిన ‘సిలికాన్’ పదార్ధం , చర్మానికి ఏ విధమైన హాని తలపెట్టదు.

రెడ్, వైట్, బ్లాక్, పింక్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ రంగుల్లో వాచ్ బ్యాండ్లు లభ్యమవుతున్నాయి. పొడవు 9.5 అంగుళాలు. మరికాస్త తక్కువ ధరకు 5.75 నుంచి 8.5 అంగుళాల సైజు వరకు వాచ్ బ్యాండ్లు లభ్యమవుతున్నాయి. ఈ వాచ్ బ్యండ్ల ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీ ఐపోడ్ నానోను ఇక మీదట క్వాడ్ మౌంటెయిన్ సంస్ధ వారి ‘వాచ్ బ్యాండ్’కు అమర్చుకుని నిశ్చితంగా జిమ్ ఇతర వ్యాయామ కార్యకలపాల్లో నిమగ్నమవవ్వచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot