చిందులేసే పిల్లి.. వినాల్సిందే?

Posted By: Prashanth

చిందులేసే పిల్లి.. వినాల్సిందే?

 

ఇంటర్నెట్‌లో రకరకాల స్పీకర్‌లను సెర్చ్ చేసి బోర్ కొట్టిందా..?, ఫర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పీకర్ కోసం ఎదురుచూస్తున్నారా..? ఫైర్‌ఫాక్స్ సంస్థ మీ కోసం ఓ వినూత్న స్పీకర్‌ను డిజైన్ చేసింది. పిల్లి ఆకృతిలో డిజైన్ కాబడిన ఈ స్పీకర్ డ్యాన్స్ కూడా చేస్తుంది..

3.5 mm ఆడియో జాక్ సౌలభ్యత కలిగిన మొబైల్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్, ఐపోడ్స్, ఎంపీత్రీ ప్లేయర్స్ తదితర మ్యూజిక్ డివైజ్‌లకు ఈ స్పీకర్ సిస్టంను జత చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లే అవుతున్న సందర్భంలో పిల్లి చేసే డ్యాన్స్ నవ్వులు కురిపిస్తుంది. డ్యాన్స్ వద్దునుకునే వారు ఏర్పాటు చేసిన బటన్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది.

మన్నికైన సౌండ్ వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టంలో నిక్షిప్తం చేశారు. 3 AA బ్యాటరీ లేదా 4.5 వోల్ట్ ఆడాప్టర్ అందించే పవర్ ద్వారా స్పీకర్ రన్ అవుతుంది. ఫైర్‌బాక్స్ డ్యాన్సింగ్ క్యాట్ స్పీకర్ ఇండియన్ మార్కెట్ ధర రూ.3,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot