బల్బ్‌లో వైర్ లెస్ మ్యూజిక్ ప్లేయర్, సింప్లీ సూపర్బ్ టెక్నాలజీ

Posted By: Staff

బల్బ్‌లో వైర్ లెస్ మ్యూజిక్ ప్లేయర్, సింప్లీ సూపర్బ్ టెక్నాలజీ

కొత్త ఉత్పత్తులకు మార్కెట్లో ఎల్లప్పుడూ కూడా మంచి గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకోని గ్లింజీ ఇంటర్నేషనల్ సంస్ద కొత్త ప్రోడక్ట్‌ని కొత్త ఐడియాతో మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దాని పేరు 'గ్లింజీ ఆడియో బల్జ్'. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆడియో బల్బ్ రూపంలో వైర్ లెస్ మ్యూజిక్ సిస్టమ్‌ని రూపొందించడంతో పాటు సూపర్ డిస్ ప్లే ఎల్‌ఈడీ లైటింగ్‌ని ఒకే దానిలో పొందుపరచడం జరిగింది. అందువల్ల దీనిని బల్బుతో పాటు, వైర్ లెస్ మ్యూజిక్ సస్టమ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

దీనిని నిశితంగా పరిశీలించినట్లైతే సింగిల్ బల్బ్ డిజైజ్ మాదిరే 5W ఎల్‌‌ఈడి లైట్ బల్బ్‌‌తో పాటు అందులోనే వైర్ లెస్ స్పీకర్‌ని పోందుపరచడం జరిగింది. ఈ స్పీకర్ అచ్చం ఐపాడ్స్, ఐఫోన్స్ మాదిరే అన్ని రకాల ట్రాక్స్‌ని ప్లే చేస్తుంది. మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో మీకు నచ్చిన పాటను మరలా మరలా వినాలంటే ఎటువంటి వైర్ కనెక్షన్ దీనికి అవసరం లేదు. ఇలా దీనికి సంబంధించిన మొత్తం ఆపరేషన్‌ని కంట్రోల్ చేయడానికి ఇందులో సపరేట్ యూనిట్ ని అమర్చడం జరిగింది. ఆడియో బల్బ్‌లో ఇలాంటి మ్యూజిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం నిజంగా అద్బుతం అంటున్నారు నిపుణులు.

మీకు కావాల్సిన ఫీచర్స్‌ని లైట్ సాకెట్ ద్వారా ఇనిస్టాల్స్ చేసుకోవచ్చు. లైట్ బల్బ్ మాదిరే లైట్ సాకెట్‌కి అమర్చుకోవచ్చు. గ్లింజీ వైస్ ప్రెసిడెంట్ రేయన్ గియోర్డానో మాట్లాడుతూ కష్టంగా ఉండే ఆడియో ప్లేయర్స్ కంటే వీటిని చాలా సున్నితంగా వాడవచ్చు. ఆడియో బల్బ్‌లు యూజర్స్‌కి ప్రెండ్లీగా ఉండడమే కాకుండా డిజైన్ పరంగా కూడా యూజర్స్ ఆసక్తిని చూపుతారు. ఈ బల్బ్‌ని ఏదైనా లైట్ సాకెట్‌లో ఫిట్ చేయవచ్చు. ఈ ఆడియో ప్లేయర్‌కి యాపిల్ 30పిన్ డాక్ కనెక్టర్ ద్వారా లగ్జరీ ఇన్ పుట్స్‌ని అందించవచ్చు.

ఇక పవర్ విషయానికి వస్తే ఆడియో బల్బ్ కేవలం 5 వాట్స్ ఎనర్జీని మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇండియన్ మార్కెట్లో అక్బోబర్ చివరి కల్లా ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. సమాన్యులకు అందుబాటులో ఉండే విధంగా దీని ధర సుమారుగా రూ 5,000 నిర్ణయించడమైనదని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot