‘రాకిట్’ వైబ్రేషన్ స్పీకర్లు రూ.3,800 మాత్రమే!!

Posted By: Staff

‘రాకిట్’ వైబ్రేషన్ స్పీకర్లు రూ.3,800 మాత్రమే!!

‘‘అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న‘రాక్ ఇట్ పోర్టుబల్ వైబ్రేషన్ స్పీకర్లు’ కేవలం రూ.3,800కే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన
‘జాబోన్’ జామ్ బాక్స్ మ్యూజిక్ పరికరాలతో పాటు స్పీకర్లు మార్కెట్లో అమ్మకాల వృద్ధిని సాధించిన విషయం తెలిసిందే.’’

క్లుప్తంగా ‘వైబ్రేషన్ స్పీకర్ల’ కాన్ఫిగరేషన్లు:

- యాంప్లీఫయర్ వ్యవస్థ ఈ స్పీకర్లలో లోపించినప్పటికి, ఆ వెలిని తీరుస్తూ స్పీకర్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌండ్ వ్యవస్థలు నాణ్యమైన ఆడియోను వినసొంపైన రీతిలో అందిస్తాయి.

- ఎంపీత్రీ ప్లేయర్లతో పాటు ఐపాడ్, ల్యాప్ టాప్ పరికరాలకు ఈ స్పీకర్లను వైరింగ్ స్టిక్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు.

- ఈ వైబ్రేషన్ స్పీకర్లు రెండు శక్తివంతమైన AAA బ్యాటరీల ద్వారా ఛార్జింగ్ అవుతాయి. యూఎస్బీ కనెక్షన్ సాయంతో కంప్యూటర్ ద్వారా స్పీకర్లకు ఛార్జింగ్ ను అందించవచ్చు

- ఏర్పాటు చేసిన 3.5mm స్టాండర్డ్ హెడ్ ఫోన్ జాక్ ద్వారా స్పీకర్లను ఇతర ఆడియో ప్లేయర్లకు అనుసంధానం చేసుకోవచ్చు.

- స్పీకర్లలో పొందుపరిచిన నాణ్యమైన సౌండ్ ఆప్లికేషన్ వ్యవస్థలు నాణ్యమైన సంగీతాన్ని వినసొంపైన పరిమాణంలో శ్రోతకు అందిస్తాయి.

- పంక్ రాక్ సంగీతంతో పాటు, క్లాసికల్ రాక్ సంగీతాన్ని అనువైన పిచ్ లో ఈ స్పీకర్లు అందిస్తాయి.

- ఆఫీస్ ఒత్తిడి నుంచి బయటపడ్డ మీరు ‘రాక్ ఇట్’ స్పీకర్ల మధుర సంగీతంతో సేదతీరొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot