అందరి చూపు ఆ వైపే..!!

Posted By: Prashanth

 అందరి చూపు ఆ వైపే..!!

 

ఆపిల్ గ్యాడ్జెట్‌లకు మ్యూజిక్ ఉపకరణాలను సమకూర్చే కంపెనీల జాబితా రోజు రోజుకు పెరగుతుతోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి ‘రాకెట్ ఫిష్’ సంస్థ వచ్చి చేరింది. ఈ కంపెనీ ప్రత్యేకించి ఐప్యాడ్ 2, ఐప్యాడ్ 3ల కోసం పోర్టబుల్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. పేరు ‘సౌండ్ ప్రిస్మ్’.ఈ మాస్ట్రర్ సౌండ్ పీస్‌ను క్రియోట్ డిజైన్ స్టూడియో డిజైన్ చేసింది. ప్రత్యేకించి ఐప్యాడ్‌లో కోసం రూపొందించబడిన సౌండ్ ప్రిస్మ్ క్లారిటీతో కూడిన హై క్వాలిటీ ఆడియోను ఉత్పత్తి చేస్తుంది.

సౌండ్ ప్రిస్మ్ విశేషాలు:

బ్లూటూత్ కనెక్టువిటీ,

రీఛార్జబుల్ డిజైన్,

బరువు 7.8oz,

ఎత్తు 1.2 అంటుళాలు,

వెడల్పు 9.5 అంగుళాలు,

లోతు 1.9 అంగుళాలు,

సంవత్సరం వారంటీ,

ధర రూ.4,000.

ఆపిల్ ఐపోడ్ టచ్:

ఆపిల్ ఐపోడ్ టచ్ ప్రపంచపు నెంబర్ -1 మ్యూజిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ ప్లేయర్ల విభాగంలో ఆధిపత్య హోదాను అధిరోహించిన ఈ డివైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తమ క్వాలిటీ మల్టీమీడియా అనుభూతలను ఈ గ్యాడ్జెట్ చేరువచేస్తుంది. ఇంటిల్లిపాదిని వినోదాల విందులో ముంచెత్తే ఆపిల్ ఐపోడ్ టచ్ 8,32,64 జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధరలు 8జీబి వర్షన్ – 10,500,32జీబి వర్షన్ -15,600, 64జీబి వర్షన్ – 21,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot