250,000 ఇంగ్లీష్ పాటలతో అదరగొట్టే ఆన్‌లైన్ మ్యూజిక్!

Posted By: Prashanth

250,000 ఇంగ్లీష్ పాటలతో అదరగొట్టే ఆన్‌లైన్ మ్యూజిక్!

 

ప్రముఖ ఉచిత ఆన్‌లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ సావ్న్(Saavn), ‘సావ్న్ ఇంగ్లీష్’ పేరుతో సరికొత్త ఆన్‌లైన్ మ్యూజిక్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సైట్‌లో మొత్తం 250,000 ఇంగ్లీష్ పాటలను నిక్షిప్తం చేశారు. ఈ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ అన్ని స్మార్ట్‌ఫోన్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ మ్యూజిక్‌ను సేకరించే క్రమంలో సోనీ మ్యూజిక్ అలాగే యూనివర్సల్ మ్యూజిక్‌లతో, సావ్న్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రముఖ ఆన్‌లైన్ మ్యూజిక్ సర్వీస్‌ గతకొంత కాలంగా బాలివుడ్, రీజనల్ అలాగే డివోషనల్ మ్యూజిక్‌ను ఆన్‌లైన్ యూజర్‌లకు ఉచితంగా అందిస్తోంది. పాండోరా, స్పోటిఫై, రిడియో వంటి ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్లు భారత్‌లో అందుబాటులో లేకపోవటాన్ని సావ్న్ అనుకూలంగా భావిస్తోంది.

గెలాక్సీ మ్యూజిక్...అదిరిపోయే మ్యూజిక్ ఫోన్!

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ మ్యూజిక్’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని శ్రోతకు అందిస్తాయి. సౌండ్ Alive & ఎస్ఆర్ఎస్ వంటి ఆడ్వాన్సుడ్ ఆడియో ఫీచర్లను డివైజ్‌లో లోడ్ చేశారు.

గెలాక్సీ మ్యూజిక్ ఫీచర్లు:

సింగిల్ సిమ్, 3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 240×320పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, 850మెగాహెడ్జ్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 3.0, జీపీఎస్/గ్లోనాస్), 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లూ, ఎల్లో ఇంకా సిల్వర్ కలర్ వేరియంట్‌లలో గెలాక్సీ మ్యూజిక్ లభ్యం కానుంది. ఫోన్ బరువు 106.9 గ్రాములు. 12.25 మిల్లీమీటర్ల మందం. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot