మస్త్ మస్త్ వినోదం!

Posted By: Super

మస్త్ మస్త్ వినోదం!

శామ్‌సంగ్ తన గెలక్సీ సిరీస్ నుంచి మరో శక్తివంతమైన పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ను ప్రవేశపెట్టబోతుంది. అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ‘శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్’ మునుపటి వర్షన్ శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 50 ప్లస్‌కు అప్‌డేటెడ్ వర్షన్.

ప్లేయర్ ముఖ్య ఫీచర్లు

* 5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* వై-ఫై,

* బ్లూటూత్,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఎఫ్ఎమ్ రేడియో,

* 2500 mAh బ్యాటరీ.

ప్లేయర్‌లో ఏర్పాటు చేసిన 5 అంగుళాల స్ర్కీన్... గేమ్స్, వీడియోలు అదేవిధంగా ఫోటోలను తిలకించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. లోడ్ చేసిన మ్యూజిక్ ప్లేయర్ విందైన ఆడియోను విడుదల చేస్తుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ప్రభావంతో డివైజ్‌లోని అప్లికేషన్‌లు ఇతర మీడియా ఫైళ్లు సజావుగా రన్ అవుతాయి. ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్ధ ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత బలోపేతం చేస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది. రెండు వర్షన్‌లలో శామ్‌సంగ్ గెలక్సీ ప్లేయర్ 70 ప్లస్ లభ్యం కానుంది. 16 జీబీ ధర (రూ.18,000), 32జీబీ ధర (రూ.21,000).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot