Home
Music

ఆపిల్‌ నెం.1 ప్లేస్‌కు సామ్‌సంగ్ ఎర్త్ పెడుతుందా..?

By Prashanth
Samsung Galaxy Player


ప్రపంచపు అత్యుత్తమ టచ్ స్ర్కీన్ మీడియా ప్లేయర్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘ఆపిల్ ఐపోడ్ టచ్’కు సామ్‌సంగ్ రూపంలో ప్రధాన పోటీ ఎదురుకానుంది. ఈ బ్రాండ్ తాజాగా రూపొందించిన ‘గెలాక్సీ ప్లేయర్ 5.8’ ఐఎఫ్ఏ 2012లో విడుదల కాబోతుంది. ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య పేటెంట్ హక్కులకు సంబంధించి వైరం నడుస్తున్న నేపధ్యంలో ఈ తాజా ఆవిష్కరణ ఏ విధమైన ప్రభావం చూపుతుందోనన్ను ఉత్కంఠ మార్కెట్ వర్గాల్లో నెలకుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ప్లేయర్ 5.8 ఫీచర్లు (స్లాష్‌గేర్ రిపోర్ట్స్ ఆధారంగా):

5.8 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 960× 540పిక్సల్స్),

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్ ఫేస్,

వీజీఏ కెమెరా,

హై క్వాలిటీ ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,

శక్తివంతమైన 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

ఆల్ షేర్ ప్లే స్ట్రీమింగ్ పోర్ట్,

సామ్‌సంగ్ చాట్ మెసెంజర్ సర్వీస్,

వై-ఫై,

బ్లూటూత్ 4.0,

జీపీఎస్.

ధర వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపిల్ ఐపోడ్ టచ్:

ఆపిల్ ఐపోడ్ టచ్ ప్రపంచపు నెంబర్ -1 మ్యూజిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ్యూజిక్ ప్లేయర్ల విభాగంలో ఆధిపత్య హోదాను అధిరోహించిన ఈ డివైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తమ క్వాలిటీ మల్టీమీడియా అనుభూతలను ఈ గ్యాడ్జెట్ చేరువచేస్తుంది. ఇంటిల్లిపాదిని వినోదాల విందులో ముంచెత్తే ఆపిల్ ఐపోడ్ టచ్ 8,32,64 జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ధరలు 8జీబి వర్షన్ – 10,500,32జీబి వర్షన్ -15,600, 64జీబి వర్షన్ – 21,000.

ఐపోడ్ టచ్‌లో నిక్షిప్తం కాబడిన పలు ముఖ్య పీచర్లు వాటి విశేషాలు:

ఫేస్ టైమ్: ఈ ఫీచర్ సౌలభ్యతతో వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు. కాలింగ్ సందర్బంలో మీరు వ్య్తక్తం చేస్తున్న హావభావాలు అవతలి వ్యక్తులకు సంపూర్ణమైన క్లారిటీతో కనిపిస్తాయి.

హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్: ఈ డివైజ్‌లో అమర్చిన సెకండరీ కెమెరా హై డెఫినిషన్ క్వాలిటీతో వీడియోలను చిత్రీకరించేందుకు తోడ్పడుతుంది. తక్కువ వెలుతురులో హై క్వాలిటీ వీడియోలను ఈ కెమెరా చిత్రీకరిస్తుంది.

రెటీనా డిస్‌ప్లే: ఐపోడ్ టచ్‌లో అమర్చిన రెటీనా డిస్‌ప్లే 960X640 రిసల్యూషన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో విజువల్స్‌ను ఖచ్చితమైన క్లారిటీతో వీక్షించవచ్చు.

ఎయిర్‌ప్లే: ఈ వ్యవస్థ సౌలభ్యతతో వైర్ల సాయంలేకండా ఫోటోలు, వీడియోలు తదితర అంశాలను షేర్ చేసుకోవచ్చు.

ఐక్లౌడ్: ఈ ఐక్లౌడ్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన కంటెంట్‌ను స్టోర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X