ఆడియో, వీడియో కెవ్వు కేక!

Posted By: Super

ఆడియో, వీడియో కెవ్వు కేక!

 

 

ఐఎఫ్ఏ -2012 సమీపిస్తున్న నేపధ్యంలో గ్యాడ్జెట్ ప్రియుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ గ్యాడ్జెట్ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా సౌత్ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ హైక్వాలిటీ

ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేరువ చేసే సరికొత్త మీడియా ప్లేయర్‌ను ఆవిష్కరించనుంది. పేరు గెలాక్సీ ప్లేయర్ 5.8. శామ్ మొబైల్ బహిర్గతం చేసిన సమాచారం మేరకు గెలాక్సీ ప్లేయర్ 5.8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి:

5.8 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం  540 x 960పిక్సల్స్),

హై క్వాలిటీ ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

1జీబి డీడీఆర్2 ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ప్లేయర్ మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిసట్ం,

టచ్‌విచ్ యూజర్ ఇంటర్ ఫేస్,

వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గైరో సెన్సార్, ఎఫ్ఎమ్ రేడియో,

2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్స్,

ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot