సంగీత ప్రపంచంలోకి ‘శ్యామ్‌సంగ్’..!!

Posted By: Super

సంగీత ప్రపంచంలోకి ‘శ్యామ్‌సంగ్’..!!

సంగీత ప్రియులకు శుభవార్త, సాంకేతిక పరికారాల దిగ్గజ బ్రాండైన ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ’ మీడియో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఎస్ వై - ఫై 3.6’ (S WiFi 3.6) పేరుతో మీడియా ప్లేయర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ పరికరం పనిచేస్తుంది.

3.6 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం కలిగిన ఈ మీడియా ప్లేయర్ అతి వేగంగా స్పందించేందుకు శక్తివంతమైన 1 GHz OMAP ప్రొసెసర్‌ను పొందుపరిచారు. వినియోగదారునికి నాణ్యమైన ఆడియో, వీడియో ప్లేబ్యాక్‌లను అందించే లక్ష్యంగా శ్యామ్‌సంగ్ ఈ గ్యాడ్జెట్‌ను విడుదల చేయునుంది.

3.6 వై - ఫై వ్యవస్థ, HVGA LCD ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్, టచ్‌విజ్ టెక్నాలజీ, AMOLED టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేలు ఈ పరికరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మైక్రో ఎస్‌డి విధానం ద్వారా జీబీని వృద్థి చేసుకోవచ్చు. బ్లూటూత్, జీపీఎస్ వంటి వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.

అక్టోబర్‌లో ‘యూకె’లో విడుదల కానున్న ‘శ్యామ్ సంగ్ గెలక్సీ వై - ఫై 3.6’, 8 జీబీ, 16 జీబీ వేరియంట్లలో లభ్యమవుతుంది. ధర అంశాలను పరిశీలిస్తే ‘8జీ’ మోడల్ ధర రూ. 9,750 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot