మాట్లూడుతూనే ఉండండి.., ఎంత ట్రాఫిక్ లో ఉన్నా..!!

Posted By: Staff

మాట్లూడుతూనే ఉండండి.., ఎంత ట్రాఫిక్ లో ఉన్నా..!!


‘‘బిజినెస్ మెన్ కోసం ‘శ్యామ్‌సంగ్’ ఓ గ్యాడ్జెట్ ను రూపొందించింది. నిత్యం వ్యాపార ఒత్తిడిలో తలమనకలయ్యే ‘బిజినెస్ ప్రొఫెషనల్స్’కు ఫోన్లు రీసీవ్ చేసుకోటానికి కూడా సమయం ఉండదూ.. ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని శ్యామ్‌సంగ్ కనుగొంది.’’

వ్యాపరవేత్తలతో పాటు సాధరాణ వినియోగదారులు ‘కాల్స్’ను సౌకర్యవంతంగా రిసీవ్ చేసే విధంగా శ్యామ్‌సంగ్ అత్యాధునిక ‘HM7000’ బ్లూటూత్ హెడ్ సెట్ ను ప్రవేశపెట్టనుంది.

కొత్త తరం ఫీచర్లను ఈ పరికరంలో పొందుపరిచారు. ‘ఐసోల్యాట్’టెక్నాలజీని హెడ్ సెట్లలో పొందుపరిచారు. ప్రయాణ సందర్భాల్లో మరింత మన్నికగా పనిచేసే ఈ వ్యవస్థ అంతరాయంలేని ‘సౌండ్’ను విడుదల చేస్తుంది. వాతవరణానికి అనుగుణంగా సౌండ్ నాణ్యత మారుతుంటుంది.

అత్యాధునిక సాంకేతిక మరియు సురక్షిత సౌండ్ వ్యవస్థతో రూపొందించబడిన ఈ ‘హెడ్ సెట్లు’చెవులకు సౌకర్యవంతంగా ఉంటాయి. సరికొత్త మైక్రో ఫోన్ వ్యవస్థను ఈ హెడ్ సెట్లలో పొందుపరిచారు. అతి తక్కువ బరువుతో ‘డిజైన్ కాబడ్డ’ ఈ చెవి స్పీకర్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

‘బ్లూటూత్’ ఆధారితంగా పనిచేసే ఈ ‘హెడ్ సెట్లు’ను సులవైన రీతిలో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో నిర్మించబడ్డ ‘శ్యామ్‌సంగ్ HM7000’ బ్లూటూత్ హెడ్ సెట్ ఇండియన్ మార్కెట్లో రూ. 4,900కు లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot