ఇక కొత్త పాటలను ‘శ్యామ్‌సంగ్ HT’లో వినండి..!!

Posted By: Super

ఇక కొత్త పాటలను ‘శ్యామ్‌సంగ్ HT’లో వినండి..!!


‘‘దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘శ్యామ్‌సంగ్’ ప్రవేశపెట్టిన D 555 డీవీడీ హోమ్ థియోటర్ సిస్టమ్, సినిమా హాల్ అనుభూతిని ఇంట్లోనే కలిగిస్తుంది. 4 స్టాండ్ స్పీకర్లతో రూపుదిద్దుకున్న ఈ హోమ్ థియోటర్ వ్యవస్థ వణుకు పట్టించే థియోటర్ అనుభూతికి లోనుచేస్తుంది. ధర కాస్తంత ఎక్కువైనప్పటికి పనితీరులో మాత్రం నెం.1.’’

- నాణ్యమైన మెటీరియల్‌ను హోమ్ థియోటర్ నిర్మాణంలో ఉపయోగించారు.

- అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో ఏర్పాటు చేసిన నాలుగు స్పీకర్లు వినిసొంపైన ఆడియోను నాణ్యమైన పరిమాణంలో శ్రోతకు అందిస్తాయి.

- శక్తివంతమైన సబ్ ఊఫర్ వ్యవస్థ హోమ్ థియోటర్‌కు మరో ఆకర్షణ.

- ధియోటర్ సెంటర్ యూనిట్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ డిస్‌ప్లే, యూఎస్బీ పోర్టులు మన్నికైన వ్యవస్థను కలిగి ఉంటాయి. పెన్‌డ్రైవ్‌లో లోడ్ చేసుకున్న పాటలను ఈ హోమ్ థియోటర్ వ్యవస్థ ద్వారా వినవచ్చు.

- యాంప్లిఫైయిర్ భాగంలో ఏర్పాటు చేసిన ఎగ్జాస్ట్ ప్యాన్ వేడిని నియంత్రిస్తుంది.

- హోమ్ థియోటర్ సిస్టంలో భాగంగా జత చేసిన డీవీడీ ప్లేయర్ స్లిమ్‌గా దర్శనమిస్తుంది. ఏర్పాటు చేసిన టచ్ కంట్రోల్ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది.

- రిమోట్ కంట్రోలింగ్ వ్యవస్థ నిరుత్సాహపరిచిందనే చెప్పొచ్చు. వివిధ వారంటీల పై విడుదలవుతున్న ‘శ్యామ్‌సంగ్ HT D 555’ హోమ్ థియోటర్ పరికరం ఇండియన్ మార్కెట్లో రూ. 28, 250కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot