శామ్‌సంగ్ మ్యూజిక్ ఇయర్ ఫోన్స్!!!

Posted By: Staff

శామ్‌సంగ్ మ్యూజిక్ ఇయర్ ఫోన్స్!!!

 

ఆడియో పరికరాల విభాగంలో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బెస్ట్ క్వాలిటీ హై-ఫై ఆడియో సిస్టమ్స్‌తో పాటు పార్టుబల్ మీడియా ప్లేయర్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక దిగ్గజం, శ్రోతకు ఆడియో అనుభూతులను మరింత నాణ్యతతో చేరువ చేసే క్రమంలో పలు రకాల ‘ఇయర్ ఫోన్’లను డిజైన్ చేసింది. ఈ న్యూ లైనప్ కు ‘యువర్ సౌండ్’గా నామకరణం చేశారు. ఇహెచ్ఎస్ - 60, ఇహెచ్ఎస్- 63, ఇహెచ్ఎస్-70, ఇహెచ్ఎస్-71 వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ ఇయర్ ఫోన్ ఫీచర్లను పరిశీలిద్దాం...

యాక్టివ్ సౌండ్ ఇహెచ్ఎస్-63: ఈ ఇయర్ ఫోన్ మోడ్రన్ ఫీచర్లతో డిజైన్ కాబడింది. ఈ ఇయర్ బడ్స్ ద్వారా ఏక కాలంలో మ్యూజిక్‌తో పాటు బయట శబ్ధాలను వినవచ్చు. ముఖ్యంగా మ్యూజిక్ వింటూ డ్రైవ్ చేసే సందర్భంలో చాలా అప్రమత్తత అవసరం, ఈ ఇయర్‌ ఫోన్‌లను ధరించి డ్రైవ్ చేయ్యటం వల్ల ఒకే సమయంలో మ్యూజిక్‌ను ఏంజాయ్ చేయ్యటంతో పాటు వెనుక నుంచి వచ్చే శబ్ధాలను పసిగట్టవచ్చు. అదే విధంగా నిఘా సమయంలో వ్యక్తి కదలికలను పరిశీలించేందుకు ఈ సౌండ్ గ్యాడ్జెట్ దోహదపడుతుంది. పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు గాను ఈ ఇయర్ ఫోన్‌లో ఓపెన్, క్లోజుడ్ స్పీకర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఈ సిరీస్‌లో మరో వేరియంట్‌లో వస్తున్న ఇయర్ ఫోన్‌లు ఇహెచ్ఎస్-70, ఇహెచ్ఎస్-71. మన్నికైన వైరింగ్ వ్యవస్థతో వీటి డిజైన్ చేశారు. మ్యూజిక్ వినటం పూర్తి కాగానే సురిక్షితమైన కేస్‌లో వీటిని ఫోల్ట్ చేసుకోవచ్చు. అప్ గ్రేడెడ్ డ్రైవర్లను ఈ ఇయర్ ఫోన్‌లలో నిక్షిప్తం చేశారు. టాప్ క్వాలిటీ సౌండ్‌ను ఈ స్పీకర్లు విడుదల చేస్తాయి. ఇహెచ్ఎస్-17 బాడీ ప్యానెల్‌ను ఎయిర్ క్రాఫ్ట్ ఆల్యూమినియమ్ మిశ్రమంతో డిజైన్ చేశారు. ఇహెచ్ఎస్ - 60 ధర రూ.1050 కాగా ఇహెచ్ఎస్-63 ధర రూ.2600. శామ్‌సంగ్ వైబ్‌సైట్‌లోకి లాగినై ఆన్‌లైన్ ద్వారా వీటిని కోనుగోలు చెయ్యచ్చు. ఇహెచ్ఎస్ - 70, 71 హెడ్‌ఫోన్‌లు ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తాయి. వీటి ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot