Home
Music

కొత్తగా ఫీలవుతారు!!

By Super
Samsung’s new Galaxy Media Player 3.6


మ్యూజిక్ ప్రపంచానికి శామ్‌సంగ్ మరో కొత్త రుచిని పరిచయం చేయునుంది. గెలక్సీ మీడియా ప్లేయర్ 3.6 స్మార్ట్‌ఫోన్ పేరుతో ఓ అత్యుత్తమ గ్యాడ్జెట్‌ను ఈ టాప్‌క్లాస్ బ్రాండ్ డిజైన్ చేసింది. ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని కోరుకునే వారికి ఈ హై ఎండ్ డివైజ్ ఉత్తమ ఎంపిక.

ఫీచర్లు:

1500mAh సామర్ధ్యం గల తొలగించే బ్యాటరీ,

1గిగాహెడ్జ్ హమ్మింగ్‌బర్డ్ ప్రాసెసర్,

3.6 అంగుళాల డిస్‌ప్లే,

మల్టీటచ్ స్ర్కీన్,

3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

512 ఎంబీ ర్యామ్,

ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం,

బ్లూటూత్ 3.0,

వై-ఫై సపోర్ట్,

డీఎన్ఎల్ఏ సపోర్ట్,

విస్తరించదగిన బాహ్య మెమరీ 32జీబి,

ఎఫ్ఎమ్ రేడియో,

గుగూల్ ప్లే స్టేషన్,

గుగూల్ టాక్,

ఇన్‌బుల్ట్ జీపీఎస్ మాడ్యుల్,

మైక్రోఎస్డీ స్లాట్,

మైక్రో యూఎస్బీ, హెడ్‌ఫోన్ పోర్టు,

సోషల్ హబ్ సపోర్ట్,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఈ మీడియా ప్లేయర్‌లో ఏర్పాటు చేసిన 3.6 అంగుళాల ఎల్‌సీడి స్ర్కీన్, 480×800 పిక్సల్ WVGA రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. మల్టీ టచ్ వ్యవస్ధ సౌలభ్యతతో ఈ డిస్ ప్లేను ఆపరేట్ చేసుకోవచ్చు. పవర్, వాల్యుమ్ కంట్రోల్‌కు సంబంధించి ఫిజికల్ బటన్‌లను డివైజ్‌లో అమర్చారు. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ప్లేయర్ రన్ అవుతుంది. లోడ్ చేసిన 1గిగా హెడ్జ్ ప్రాసెసర్ పనితీరు పై మరింత ప్రభావం చూపుతంది

పొందుపరిచిన వై-ఫై వ్యవస్ధ ఆధారితంగా డివైజ్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ మార్కెట్‌ను యాక్సిస్ చేసుకునే సౌలభ్యతతో ఉండటంతో వేల సంఖ్యలో అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు ఉత్తమమైన పనితీరును కనబరుస్తాయి. 512 ఎంబీ ర్యామ్ డివైజ్ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డు విధానం ద్వారా మెమెరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు. వాయిస్ కాలింగ్ సపోర్ట్ ఈ పరికరంలో లోపించింది. ఈ VOIP ఫీచర్ తీరుస్తుంది.

పోర్టబుల్ మీడియా ప్లేయర్ల విభాగంలో గెలక్సీ మీడియా ప్లేయర్ 3.6, కొత్త ఒరవడికి బీజం వేయనుందని సంబంధిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ వై-ఫై ఆధారిత పోర్టుబుల్ మీడియా ప్లేయర్ కిట్‌తో వైర్లతో కూడిన హెడ్‌సెట్ అదేవిధంగా మైక్రోఫోన్‌ను పొందవచ్చు.8 ఇంకా 16 జీబి మెమరీ వేరియంట్‌లలో ప్లేయర్ లభ్యమవుతుంది. ధర అంచనా 15,000. సౌత్ కొరియాలో మాత్రమే వీటినే విక్రయిస్తున్నారు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X