‘శ్యాండిస్క్ ఎంపత్రీ ప్లేయర్’, ఇప్పుడు కొత్త ఫీచర్లతో!!

Posted By: Super

‘శ్యాండిస్క్ ఎంపత్రీ ప్లేయర్’, ఇప్పుడు కొత్త ఫీచర్లతో!!

మీకు శ్యాండిస్క్ బ్రాండ్ గుర్తిందికదండి.., అత్యుత్తమ సాంకేతిక పరికరాలను మన్నికైన ధరలో వినియోగదారులకందించే ఈ ప్రముఖ బ్రాండ్ అపడేటడ్ ‘సాన్సా ఎంపీత్రీ ప్లేయర్’ను మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త వర్షన్‌లో విడుదలైన ‘సాన్సా మ్యాజిక్ ప్లేయర్’ కొత్త ఫీచర్లను రంగరించుకంది.

మ్యూజిక్ ఫైల్ సమచారం డిస్‌ప్లే అయ్యే విధంగా 1.1 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్‌ను ప్లేయర్లో ఏర్పాటు చేశారు. ఎఫ్ఎమ్ స్టేషన్ వ్యవస్థ ప్లేయర్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఇన్‌బుల్ట్ మైక్రో ఫోన్, వాయిస్ రికార్డింగ్ ప్లేబ్యాక్, స్టాప్‌వాచ్ తదితర అప్లికేషన్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

4జీబీ, 8జీబీ వేరియంట్లలో ఈ ఎంపీత్రీ ప్లేయర్లు లభ్యమవుతున్నాయి. మైక్రో SDHC విధానం ద్వారా జీబీని 32కు వృద్ధి చేసుకోవచ్చు. మన్నికైన బ్యాటరీ వ్యవస్థ 15గంటల దీర్ఘకాలిక బ్యాకప్ నిస్తుంది. ప్లేయర్లో ముందుగానే లోడ్ చేసిన బ్లూటూత్ వ్యవస్థను ఎక్సటర్నల్ హార్డ్‌వేర్ల ద్వారా సింక్రనైజ్ చేసుకోవల్సి ఉంది.

బ్లాక్, బ్లూ, గ్రే, ఆరెంజ్, పర్పిల్, వైట్ రంగుల్లో ఈ ప్లేయర్లు డిజైన్ చేయబడ్డాయి. అత్యాధునిక ఫీచర్లతో పొందుపరిచిన సౌండ్ వ్యవస్థ నాణ్యమైన ఆడియో క్వాలిటీని శ్రోతకు అందిస్తుంది. చివరిగా వీటి ధరలను పరిశీలిస్తే, ఇండియన్ మార్కెట్లో 4జీబీ సామర్ధ్యంగల ఎంపత్రీ ప్లేయర్ రూ.2,500కు, 8జీబీ సామర్ధ్యం గల ఎంపీత్రీ ప్లేయర్ రూ.3,500కు లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot