జేబులో పెట్టుకునే బ్లూటూత్ స్పీకర్!!!

Posted By: Prashanth

జేబులో పెట్టుకునే బ్లూటూత్ స్పీకర్!!!

 

ఆడియోను మన్నికైన క్వాలిటీతో విడుదల చేసే స్లిమ్ బ్లూటూత్ స్పీకర్ ను ‘సటెక్కీ’(Satechi) సంస్థ విడుదల చేసింది. చిన్నదైన ఈ వైర్‌లెస్ స్పీకర్‌ను జేబులో పెట్టకుని ప్రయాణించవచ్చు. బ్లూటూత్ సౌలభ్యత కలిగిన అన్ని గ్యాడ్జెట్‌లకు ఈ పోర్టబుల్ స్పీకర్ సిస్టంను జత చేసుకోవచ్చు.

అపూర్వమైన ఫోల్డ్ - అవుట్ రిసోనేటర్ టెక్నాలజీని స్పీకర్‌లో నిక్షిప్తం చేశారు. ఈ ప్రత్యేక వ్యవస్థ మన్నికైన బాస్‌ను విడుదల చేస్తుంది. గుండ్రటి గోళీ ఆకృతిలో డిజైన్ కాబడిన ఈ స్పీకర్ సిస్టంకు అడుగు భాగంలో ఏర్పాటు చేసిన నాలుగు పిల్లర్లు సపోర్ట్ గా నిలుస్తాయి. మినీ యూఎస్బీ కేబుల్ ద్వారా స్పీకర్‌కు ఛార్జింగ్ పెట్టుకునే సౌలభ్యత. సంగీతాన్ని వినసొంపైన బాణిలో ఈ స్పీకర్ వ్యవస్థ అందిస్తుంది, అంతేకాకుండా కాల్స్ చేసిన సందర్భంలో అవతలి వ్యక్తి వాయిస్‌ను క్లారిటీతో వినపడేలా చేస్తుంది. Satechi బ్లూటూత్ వైర్‌లెస్ స్పీకర్ ధర భారతీయ మార్కెట్లో రూ.2,400.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot