మ్యూజిక్‌ను తనివితీరా ఆస్వాదించండి....!

Posted By: Super

మ్యూజిక్‌ను తనివితీరా ఆస్వాదించండి....!

మ్యూజిక్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఉత్తమ లక్షణాలు ఒదిగి ఉన్న స్పీకర్ సిస్టంను ఎంపిక చేసుకుంటారు. ఇంట్టో ఉన్న సందర్భంలో హై-ఫై సిస్టం ద్వారా, ప్రయాణ సందర్బాల్లో హెడ్‌ఫోన్‌ల ద్వారా గుడ్ క్వాలిటీ మ్యూజిక్‌ను ఏంజాయ్ చేస్తుంటారు. సంగీతాన్ని ఆస్వాదించే క్రమంలో హెడ్‌ఫోన్‌లను వినియోగిస్తున్న పలువురు ఆసౌకర్యానికి లోనవుతుంటారు. ఇటువంటి వారికి ఉత్తమ ఆప్షన్ మినీ పోర్టుబల్ స్పీకర్ సిస్టం. ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పత్తిదారు సటెక్కి (Satechi) శక్తివంతమైన బ్లూటూత్ పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్ సిస్టంను డిజైన్ చేసింది. తక్కువ బడ్జెట్‌తో లభ్యమయ్యే ఈ స్పీకర్ సిస్టం మన్నికైన ఆడియోను విడుదల చేస్తుంది.

ఈ స్పీకర్ గ్యాడ్జెట్ ప్రధాన విశేషాలు:

తక్కువ బరువు, ఆకర్షణీయమైన డిజైన్, బాస్ఎక్స్ ప్యానిషన్, శక్తివంతమైన సౌండ్ అవుట్ పుట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో ఆడాప్టర్, ప్లేబ్యాక్ కంట్రోల్ బటన్స్, లితియమ్ ఐయాన్ రిఛార్జబుల్ బ్యాటరీ, 6 గంటల ప్లేబ్యాక్ టైమ్, మినీ యూఎస్బీ పోర్ట్, బ్లూటూత్.

ప్రయాణ సందర్భంలో ఈ స్పీకర్‌ను సలువుగా తీసుకు వెళ్చొచ్చు. ఏర్పాటు చేసిన బాస్ఎక్స్ ప్యానిషన్ వ్యవస్థ మ్యూజిక్ రిథమ్‌ను పెంచుతుంది. మొబైల్ , ల్యాప్‌టాప్ తదితర డివైజుల ద్వారా మ్యూజిక్‌ను స్ట్ర్రీమ్ చేసుకోవచ్చు. 3.5ఎమ్ఎమ్ ఆడియో ఆడాప్టర్ ద్వారా యూఎస్బీ మ్యూజిక్ గ్యాడ్జెట్‌లకు ఈ స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.

play/pause వంటి మ్యూజిక్ కంట్రోల్ బటన్‌లను స్పీకర్ ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఈ బటన్‌ల ద్వారా సౌండ్ ట్రాక్‌ను అదేవిధంగా సౌండ్ వాల్యుమ్‌ను నియంత్రించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో సటెక్కీ బ్లూటూత్ పోర్టుబల్ స్పీకర్ ధర రూ 3,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot