సటెక్కీ రిఛార్జబుల్ స్మార్ట్ ఫోన్ స్పీకర్!!!

Posted By: Prashanth

సటెక్కీ రిఛార్జబుల్ స్మార్ట్ ఫోన్ స్పీకర్!!!

 

మన్నికైన ఆడియో ఉత్పత్తులను రూపొందించటంలో ప్రాచుర్యం పొందిన బ్రాండ్ ‘సటెక్కీ’ అత్యుత్తమ సౌండ్ క్వాలిటీనిచ్చే రీఛార్జబుల్ స్మార్ట్ ఫోన్ స్పీకర్‌ను డిజైన్ చేసింది. ‘సటెక్కీ ఆడియో మూవీ ఎస్డీ కాంపాక్ట్’ మోడల్‌లో వస్తున్న ఈ పోర్టబుల్ స్పీకర్ అత్యుత్తమ శబ్ద నాణ్యతను శ్రోతకు పంచుతుంది. ఈ పోర్టబుల్ స్పీకర్ స్మార్ట్ ఫోన్‌లకు పూర్తి స్థాయిలో ఫిట్ అవుతుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ వ్యవస్థ ద్వారా 600 ఆల్బమ్స్‌ను స్టోర్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు.

స్పీకర్ కీలక ఫీచర్లు:

* 2 స్పీకర్ కాన్ఫిగరేషన్,

* మన్నికైన స్టీరియో సౌండ్,

* 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్, 600 ఆల్బమ్స్‌ను స్టోర్ చేసుకునే సౌలభ్యత,

* మన్నికైన సౌండ్ టెక్నాలజీ,

* యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్

* 17 గంటల బ్యాటరీ బ్యాకప్,

* 5V USB యూఎస్బీ పవర్ ఆడాప్టర్,

* తక్కువ బరువు,

* సులభమైన పోర్టబిలిటీ.

3.5 ఆడియో జాక్ ఆధారితంగా స్మార్ట్‌ఫోన్‌కు ఈ స్పీకర్‌ను జత చేసుకోవచ్చు. యూఎస్బీ పవర్ ఆడాప్టర్ ఆధారితంగా స్పీకర్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. డివైజ్ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో పాటు తక్కువ బరువు స్వభావాన్ని కలిగి ఉండటంతో ప్రయాణ సందర్భాల్లో సలువుగా క్యారీ చేయ్యవచ్చు. మన్నికైన ఆడియోను కోరుకునే శ్రోతకు సటెక్కీ రిఛార్జబుల్ స్మార్ట్ ఫోన్ స్పీకర్ ఉత్తమైన ఛాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot