‘కింగ్’లాంటి స్పీకర్లు!!

Posted By: Super

‘కింగ్’లాంటి స్పీకర్లు!!

 

మ్యూజిక్ పరికరాల తయారీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న ఆధునిక సమీకరణలు సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఆడ్వాన్సడ్ ఫీచర్లతో వినసొంపైన సంగీతాన్ని నాణ్యమైన్ పిచ్ లో అందించేందుకు ‘పోర్టుబుల్ యూఎస్బీ స్పీకర్లు’ మ్యూజిక్ గ్యాడ్జెట్ల స్టోర్లలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా స్కోస్కీ (Scosche) సంస్ధ అత్యాధునిక బూమ్ కెన్(BoomCAN) మ్యూజిక్ స్పీకర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఖచ్చితమైన, నాణ్యమైన, మన్నికైన అంతరాయంలేని సంగీతాన్ని ఈ పోర్టుబల్ మ్యూజిక్ గ్యాడ్జెట్ వినియోగదారుడికి అందిస్తుందని సంస్ధ అధికార వర్గాలు భరోసా వ్యక్తం చేస్తున్నాయి.

ఐఫోన్, ఐపోడ్, ఐప్యాడ్ మరియు ఆండ్రాయిడ్ డివైజులతో ఈ రౌండ్ స్పీకర్ సిస్టంను యూఎస్బీ కేబుల్ ఆధారితంగా జత చేసుకోవచ్చు. రెడ్, బ్లూ, సిల్వర్, బ్లాక్ రంగుల్లో ఈ స్పీకర్ గ్యాడ్జెట్లు మ్యూజిక్ స్టోర్లలో లభ్యమవవుతున్నాయి.

సిస్టంలో ఏర్పాటు చేసిన మినీ యూఎస్బీ పోర్టు ఆధారితంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. శక్తివంతమైన ఆల్యూమినియమ్ పదార్థాన్ని స్పీకర్ల నిర్మాణంలో వినియోగించారు. గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన ‘బ్లూ LED లైట్’ స్పీకర్ స్థితిగతులను ఎప్పటికప్పుడు సూచిస్తుంది.

300mAh సామర్ధ్యం గల లితియమ్ ఇయాన్ బ్యాటరీని స్పీకర్లో ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం 4 నుంచి 7 గంటలు. స్పీకర్ గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన 3.5mm అవుట్ పోర్టు సౌలభ్యతతో అదనంగా రెండు స్పీకర్లకు జత చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబడిన బూమ్ కెన్ స్పీకర్లు భారతీయ మార్కెట్లో రూ.2,000లకు లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot