ఆ హెడ్ ఫోన్ పెట్టకుంటే..?

Posted By: Staff

ఆ హెడ్ ఫోన్ పెట్టకుంటే..?

 

ఆడియో పరికరాల తయారీలో అందవేసిన చేయ్యిగా ముద్రవేసుకున్న ‘సెన్ హైసర్’ (Senheiser) బ్రాండ్ హై డెఫినిషన్ సిరీస్ హెడ్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. హై డెఫినిషన్ సరీస్ లో భాగంగా HD 650, HD 800 మోడళ్ల హెడ్ ఫోన్లు మార్కెట్లో విడుదలయ్యాయి. స్టూడియో అవసరాలకు సంబంధించి ఆడియో నాణ్యతకు మరింత దోహద పడే ఈ హెడ్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నాయి.

 ఫీచర్లు ఇతర వివరాలు క్లుప్తంగా:

- తొలత మార్కెట్లో విడుదలైన HD 650 మోడల్ హెడ్ ఫోన్లు ‘ఇయర్ కప్ డిజైన్ల’లోపంతో వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయాయి.

- తరువాత మోడల్‌గా విడుదలైన HD 800 అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంది.

- మైక్రో ఫైబర్ పదర్థాన్ని ఈ హెడ్‌ఫోన్ తయారీలో వినియోగించారు.

- హెడ్‌సెట్లలో పొందుపరిచిన ట్రాన్సిస్టర్, డ్రైవర్ ఆసెంబ్లీ వ్యవస్థలు ఆడియోను నాణ్యమైన క్లారిటీలో వినియోగదారుడుకి అందిస్తాయి.

- ధృడమైన 6.3 mm కేబుల్ వ్యవస్థను ఈ హెడ్‌సెట్లలో పొందుపరిచారు.

- స్టూడియో అవసరాలకు సంబంధించి ఈ హెడ్‌ఫోన్ మరింత ఉపయోగపడుతుంది.

- అధునాత వ్యవస్థతో రూపుదిద్దుకున్న HD 800 హెడ్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర రూ. 80,000 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot