అడిడాస్, సెన్‌హైసర్ హాలిడే హెడ్‌ఫోన్స్!!!

Posted By: Prashanth

అడిడాస్, సెన్‌హైసర్ హాలిడే హెడ్‌ఫోన్స్!!!

 

అంతర్జాతీయ ఆడియో పరికరాల ఉత్పత్తి బ్రాండ్‌లైన సెన్‌హైసర్, అడిడాస్‌లు హాలిడే హెడ్‌ఫోన్‌లను విడుదల చేశాయి. ఆకర్షణీయమైన డిజైన్‌లతో, అత్యుత్తమ సౌండ్‌ను అందించే విధంగా ఈ ఆడియో గ్యాడ్జెట్‌లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

CX 215, MX 365 మోడళ్లలో సెన్‌హైసర్ హెడ్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ డివైజ్‌ల ద్వారా వెలువడే సౌండ్ శ్రోతకు మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. వీటి ధరలను పరిశీలిస్తే ‘CX 215’ ఇండియన్ మార్కెట్ ధర రూ.2,000 కాగా ‘MX 365’ ధర ఇంకాస్త తక్కువుగా ఉంటుంది. రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్రాంజ్, బ్రౌన్, బ్లూ రంగుల్లో ఈ హెడ్‌ఫోన్‌లు డిజైన్ కాబడ్డాయి.

CX 310, HD 25, HD 220 వేరియంట్‌లలో సెన్‌హైసర్, అడిడాస్‌లు సంయుక్తంగా విడుదల చేసిన మూడు సరికొత్త కూల్ లుకింగ్ హెడ్‌ఫోన్స్ అత్యుత్తమ సౌండ్‌ను విడుదల చేస్తాయి. మన్నికైన బాస్ అదేవిధంగా స్టీరియో వ్యవస్థలను ఈ హెడ్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. వీటి ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot