ఐఫోన్ కోసం ప్రత్యేకమైన హెడ్‌ఫోన్

Posted By: Staff

ఐఫోన్ కోసం ప్రత్యేకమైన హెడ్‌ఫోన్

 

ఫ్రముఖ ఆడియో గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ష్యూర్ ఇటీవల డిజైన్ చేసిన ఇయర్ ఫోన్ లకు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సంస్థ రూపొందించిన SE115m+ హెడ్ ఫోన్ పై మార్కెట్లో వాడి వేడి చర్చ సాగుతోంది. ఐఫోన్

హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఆడియో సిస్టం క్లారిటీ విషయంలో ఏమాత్రం రాజీపడదు. రెడ్, బ్లూ, పింక్, బ్లాక్ వంటి భిన్నమైన కలర్ వేరియంట్‌లలో ఈ హెడ్‌ఫోన్ లభ్యం కానుంది.

హెడ్ ఫోన్ ప్రధాన ఫీచర్లు:

* సౌండ్ ఐసోలేటింగ్ డిజైన్,

* డైనమిక్ మైక్రోస్పీకర్ టెక్నాలజీ,

* ఎల్బో- స్టైల్ ప్లగ్,

* ప్రొటెక్టింగ్ కారియంగ్ కేస్.

హెడ్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డైనమిక్ మైక్రో స్పీకర్ టెక్నాలజీ సమగ్ర ఆడియో శ్రవణ అనుభవాన్ని శ్రోతకు పంచుతుంది. డిజైన్ చేసిన హై క్వాలిటీ ఇయర్‌బడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. ప్రొటెక్టివ్ క్యారియంగ్ కేస్‌ను ఈ ఇయర్ ఫోన్స్ ద్వారా పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో ధర రూ.6,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot