లైఫ్ విత్ బ్యూటిఫుల్ సౌండ్!!

By Prashanth
|

Shure SE115m+

ఫ్రముఖ ఆడియో గ్యాడ్జెట్ల తయారీ సంస్థ ష్యూర్ ఇటీవల డిజైన్ చేసిన ఇయర్ ఫోన్‌లకు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సంస్థ రూపొందించిన SE115m+ హెడ్ ఫోన్ పై మార్కెట్లో వాడి వేడి చర్చ సాగుతోంది. ఐఫోన్ హ్యాండ్‌సెట్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఆడియో సిస్టం క్లారిటీ విషయంలో ఏమాత్రం రాజీపడదు. రెడ్, బ్లూ, పింక్, బ్లాక్ వంటి భిన్నమైన కలర్ వేరియంట్‌లలో ఈ హెడ్‌ఫోన్ లభ్యమవుతుంది.

హెడ్ ఫోన్ ప్రధాన ఫీచర్లు:

* సౌండ్ ఐసోలేటింగ్ డిజైన్,

 

* డైనమిక్ మైక్రోస్పీకర్ టెక్నాలజీ,

* ఎల్బో- స్టైల్ ప్లగ్,

* ప్రొటెక్టింగ్ కారియంగ్ కేస్.

హెడ్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డైనమిక్ మైక్రో స్పీకర్ టెక్నాలజీ సమగ్ర ఆడియో శ్రవణ అనుభవాన్ని శ్రోతకు పంచుతుంది. డిజైన్ చేసిన హై క్వాలిటీ ఇయర్‌బడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. ప్రొటెక్టివ్ క్యారియంగ్ కేస్‌ను ఈ ఇయర్ ఫోన్స్ ద్వారా పొందవచ్చు. ధర రూ.6,000.

హై డెఫినిషన్ మ్యూజిక్‌ కోసం మాన్సటర్!!

ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పాదక సంస్థ మాన్సటర్ ( Monster) ఆరు కొత్త రంగులతో కూడిన హెడ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. బీట్ సిరీస్ నుంచి వస్తున్న ఈ హై డెఫినిషన్ హెడ్‌సెట్‌లు శ్రోతను ప్రొఫెషనల్ మ్యూజిక్ అనుభూతికి లోను చేస్తాయి. చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ హెడ్‌సెట్ ఇయర్‌కప్‌లను డిజైన్ చేశారు. మ్యూజిక్ వింటున్న సందర్భంలో శ్రోత కంఫర్ట్‌గా ఫీలయ్యేందకు గాను చల్లదనాన్నిచ్చే సున్నితమైన పదార్ధాన్ని ఇయర్‌కప్స్ నిర్మాణంలో వినియోగించినట్లు తెలుస్తోంది.

మాన్సటర్ పవర్ ఐసోలేషన్ టెక్నాలజీని ఈ హెడ్‌సెట్‌లలో దోహదం చేశారు. ఈ వ్యవస్థ సౌలభ్యతతో లైవ్ స్టూడియో అనుభూతిని శ్రోత ఆస్వాదించగలుగుతాడు. త్వరలోనే మాన్సటర్ బీట్ హెడ్‌ఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతాయని కంపెని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఈ హెడ్‌సెట్‌లను బుక్ చేసుకునే సౌలభ్యతను కల్పించారు. ఆన్‌లైన్ రిటైలర్ దుకాణాల్లో రూ.4000 నుంచి వీటి ప్రారంభ ధరలు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X