‘గాలి’ గొట్టాల మాయ..?

Posted By: Staff

‘గాలి’ గొట్టాల మాయ..?

సింగింగ్ రింగింగ్ ‘ట్రీ’ పేరు వింటేనే కొత్తగా ఉంది కదూ... చెట్టు ఆకారంలో ఉండే ఈ నిర్మాణం నుంచి ఎప్పుడు శృతి శుద్ధమైన సంగీతం వెలువుడుతుంది.

మూడు మీటర్ల ఎత్తులో తుప్పు పట్టిన స్టీలు గొట్టాలతో రూపొందించిన ఈ ‘సింగింగ్ రింగింగ్ ట్రీ’ లాంకషైర్ (ఇంగ్లాండ్)లోని పర్వత ప్రాంతాల దగ్గర 2006 నుంచి దర్శనమిస్తుంది. గొట్టాల్లోకి గాలి వీచినపుడు సంగీతం వినిపించేలా వేరు వేరు సైజుల్లో ఉన్న స్టీలు గొట్టాలను నిర్మాణం ఉపయోగించారు.

ఆర్కిటెక్చురల్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకున్న ఈ చెట్టును చూసేందుకు ఔత్సాహికులు భారీ సంఖ్యలో ఈ ప్రాంతానికి తరలి వస్తారట. విన్నారుగా మానవుని మేధస్సు ఎంత పొదునైనదో.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot