స్కల్ క్యాండీ ఇయర్ హెడ్ ఫోన్స్ ద్వారా రమ్యమైన సౌండ్ క్వాలిటీ!!

Posted By: Super

 స్కల్ క్యాండీ ఇయర్ హెడ్ ఫోన్స్ ద్వారా రమ్యమైన సౌండ్ క్వాలిటీ!!

 

రకరకాల సైజులతో... వేరు వేరు కాన్ఫిగరేషన్‌లలో మ్యూజిక్ హెడ్‌ఫోన్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఫ్రొపెషనల్ క్వాలిటీ సౌండ్‌ను అందించగలుగుతున్నాయి. ఈ కోవకే చెందిన ‘స్కల్ క్యాండీ’ టెక్నాలజీ‌కి ఫ్యాషన్‌ను జోడించి అత్యాధునిక ఇయర్ హెడ్‌ఫోన్‌లను డిజైన్ చేసింది. ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో వీటిని ప్రదర్శించారు. ఈ సౌండ్ డివైజ్ అద్భుతమైన ధ్వని నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన కలర్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది.

క్లుప్తంగా స్కల్‌క్యాండీ మిక్సర్ మాస్టర్ హెడ్‌ఫోన్ ఫీచర్లు:

* యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్,

* అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ,

* డ్యూయల్ కేబుల్,

* వన్-టచ్ మ్యూట్,

* సింగిల్ ఛానల్ క్యూ కంట్రోల్,

* 50 ఎమ్ఎమ్ స్పీకర్స్,

* బుల్ట్ ఇన్ మైక్రోఫోన్,

* గోల్డ్ ప్లేటెడ్ కనెక్టర్స్,

* నాయిస్ ఐసోలేషన్ ఫీచర్,

* ఫ్రీక్వెన్సీ స్పందన 20Hz మరియు 20, 000 Hz మధ్య ఉంటుంది.

వివిధ కలర్ కాంభినేషన్‌లలో లభ్యమవుతున్న ఈ హెడ్‌ఫోన్ ప్రారంభ ధర రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot