స్కల్ క్యాండీ హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు!!

Posted By: Prashanth

స్కల్ క్యాండీ హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు!!

 

ఆడియో వస్తువుల్లో భాగమైన హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ వినియోగం రోజుకు రోజుకు పెరుగుతోంది. మ్యూజిక్ ఉత్పత్తులకు ప్రధానంగా డిమాండ్ ఉన్న ఇండియాలో అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. హై క్వాలటీ ఆడియో ఉత్పత్తులను డిజైన్ చేయటంలో సుప్రసిద్ధ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘స్కల్ క్యాండీ’( Skullcandy) 4 సరికొత్త ఆడియో పరికరాలను ప్రవేశపెట్టింది. వాటి ఫీచర్లు క్లుప్తంగా:

స్కల్ క్యాండీ ఏవియేటర్ హెడ్‌ఫోన్:

- నాణ్యమైన సౌండ్ క్వాలిటీ,

- ఆకర్షణీయమైన సెమీ ట్రాన్‌స్క్యులెంట్ కవర్,

- చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అయ్యే విధంగా ఇయర్‌కప్స్ రూపకల్పన,

- ఇన్‌లైన్ రిమోట్ వ్యవస్థ,

- అబ్బుర పరిచే డిజైన్,

- హెడ్‌ఫోన్లను ఫోల్డ్ చేసుకునే సౌలభ్యత, ప్రత్యేక క్యారీ కేస్,

- ధర రూ.8,999

స్కల్‌క్యాండీ అప్‌రాక్ హెడ్‌ఫోన్స్:

- హై క్లారిటీ సౌండ్, రెండు 40 mm డ్రైవర్లను డివైజులో నిక్షిప్తం చేశారు, ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన 20 నంచి 20, 000 వరకు, డివైజ్ impedance 32 ohm, గోల్డ్ ప్లేటెడ్ ప్లగ్, సాఫ్ట్ ఇయర్ పిల్లోస్, చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అయ్యే విధంగా ఇయర్ కప్స్ రూపకల్పన, ధర రూ.1,599

స్కల్‌క్యాండీ ఫిక్స్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్:

- సుప్రిమ్ సౌండ్ క్వాలిటీ, ఆకర్షణీయమైన డిజైన్, 3.5mm ఆడియో జాక్, చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అయ్యే విధంగా ఇయర్ కప్స్ రూపకల్పన, ధర Rs. 3, 899/.

స్కల్ క్యాండీ హెవీ మోడల్ హెడ్‌ఫోన్:

- తక్కువ బరువు, ఆకర్షణీయమైన డిజైన్, అత్యుత్తమమైన సౌండ్ క్వాలిటీ, ఇన్ బుల్ట్ మైక్రో ఫోన్, పూర్తిగా హ్యాండ్ ఫ్రీ డివైజ్, ధర రూ.4,599.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot