తలగడతో సంగీతం..!!

Posted By: Staff

తలగడతో సంగీతం..!!

 

సంగీతాన్ని ఆస్వాదిస్తూ నిద్రలోకి జూరుకునే అలావాటు మీకుందా..?, ఇక పై మీరు ఇష్టమైన పాటలను హెడ్ సెట్ లు ద్వారా స్పీకర్ల ద్వారా వినాల్సిన అవసరం లేదు. తలదిండు కొనుక్కుంటే చాలు.

ఆశ్చర్యపోతున్నారా..?, మీరు వింటున్నది నిజమే ఈ చిత్రంలో మీకు కనిపిస్తున్న తలగడ పేరు Sound A Sleep. ఈ తలగడలో ప్రత్యేకంగా స్పీకర్లను అమర్చారు. ఎంపీ3 ప్లేయర్, రేడియో, టీవీలను 3.5 ఎంఎం స్టీరియో జాక్ ఆధారితంగా తలగడకు జత చేసుకోవచ్చు. ప్రయాణాల్లో విశ్రాంతితో పాటు వినోదాన్ని పొందేందుకు ఇదో చక్కని మార్గం.

ఇతరులకు ఇబ్బంది లేకుండా పాటలు, రేడియో వినొచ్చు. పాటల మెనూ పూర్తవ్వగానే ఆటోమాటిక్ గా ఆఫ్ అవుతుంది. విద్యార్థులు ఆడియో పాఠాలను వింటు నిద్రపోవచ్చు. ధర రూ.1150.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting