వినండి.. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా!!

Posted By: Staff

వినండి.. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా!!
ఉన్నత ప్రమాణాలతో మ్యూజిక్ పరికరాలను రూపొందించటంలో ‘సోనార్’ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తాజాగా ఈ బ్రాండ్ విడుదల చేసిన ‘పోర్టబుల్ మినీ స్పీకర్’ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్. అత్యాధునిక సౌండ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ‘సైబర్ స్నిపా సోనార్ పోర్టబుల్ మినీ స్పీకర్’, హై బాస్ సామర్ధ్యం కలిగి వినసొంపైన సంగీత అనుభూతిని శ్రోతకు కలిగిస్తుంది.

స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పీసీలలోని మ్యూజిక్ ఫీచర్లు మరియు బాస్ ఫంక్షన్లను. ఈ ‘సోనార్’ మినీ స్పీకర్లలో ఏర్పాటు చేసారు. ప్రయాణ సందర్భాల్లో స్పీకర్లు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.

క్లుప్తంగా పోర్టబుల్ స్పీకర్ల ఫీచర్లు:

- మన్నికైన రబ్బరు భాగం పై స్పీకర్లను అమర్చారు. ఆన్, ఆఫ్ బటన్లతో పాటు వాల్యుమ్ కంట్రోల్ బటన్లను స్పీకర్లలో అమర్చారు.

- స్పీకర్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన యూఎస్బీ ఆడియో ఇన్ పుట్/అవుట్ పుట్ ప్లగ్, 3.5 mm ఆడియో ఇన్ పుట్/అవుట్ పుట్ పోర్టులకు, స్మార్ట్ ఫోన్ మరియు టాబ్లెట్ పీసీలను  అనుసంధానం చేసుకోవచ్చు.

- ఆడ్వాన్సడ్ ఫీచర్లను పరిశీలిస్తే ‘వ్యాక్యుమ్ బాస్ ఛాంబర్’ మ్యూజిక్ వ్యవస్థ స్పీకర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

- స్పీకర్లలో ఏర్పాటు చేసిన క్నాబ్ ( knob)ను క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిప్పినట్లయితే ‘వ్యాక్యుమ్ బాస్ ఛాంబర్’

వ్యవస్థ ఆన్ అవుతుంది.

- అదే క్నాబ్ (knob)ను కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిప్పినట్లయితే ‘వ్యాక్యుమ్ బాస్ ఛాంబర్’ వ్యవస్థ ‘ఆఫ్’ అవుతుంది.

- యూఎస్బీ కేబుల్, స్పీకర్ ఛార్జింగ్‌కు దోహదపడుతుంది.

- స్పీకర్లలో ఏర్పాటు చేసిన ‘లితియమ్ రీఛార్జబుల్ బ్యాటరీ వ్యవస్థ’ 4 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- కేవలం 3.4 అవున్సుల బరువు కలిగిన ఈ స్పీకర్లు రూ.1200కు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot