యువ సంగీత ప్రియుల కోసం ‘ సోని వాక్ మెన్ ’..

Posted By: Super

యువ సంగీత ప్రియుల కోసం ‘ సోని వాక్ మెన్ ’..

‘‘మ్యూజిక్ అంటే చెవులు తెగ్గోసుకునే యువతకు తాజా వార్త, ప్రతి క్షణం మ్యూజిక్ ప్రవాహంలో మునిగితేలే మీ కోసం ‘సోని’ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆధారిత ‘వాక్ మెన్’ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.’’

ఆధునిక సాంకేతికతతో శ్రోతలను సంగీత సాగరంలో పరవశింప చేసేందుకు దిగ్గజ సాంకేతిక పరికారల తయారీ దారు ‘సోని’ సరికొత్త ఆండ్రాయిడ్ ఆధారిత ‘వాక్ మెన్’ పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రత్యేకించి సంగీత ప్రియుల కోసం రూపుదిద్దుకుంటున్న ఈ ‘వాకీ’ని సంగీత ప్రియులే రూపొందించడం విశేషం. సోని మునుపటి ‘వాక్ మెన్ల’తో పోలిస్తే, సరికొత్త ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆధారిత సంగీత పరికరం 250000 ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్టు చేస్తుంది.

ఈ వాక్‌మెన్‌లో పొందుపరిచిన సంగీత వ్యవస్థ మరే ఇతర సంగీత పరికరాల్లో లేనంత నాణ్యతను కలిగి ఉంటుంది. 4.3 అంగుళాలు కలిగిన ‘వాకీ’ డిస్‌ప్లే పై మీరు ఎంచుకున్న ఆల్బబ్ చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. ఈ పరికరంలో పొందుపరిచిన ‘సెన్స్‌మీ’ వ్యవస్థ సంగీతాన్నినాణ్యమైన పిచ్‌లో శ్రోతకు అందిస్తుంది.

శక్తివంతమైన 1 GHz ప్రొసెసింగ్ వ్యవస్థ సమర్ధమైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ వాక్‌మెన్‌లో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ కెమెరా, 720 పిక్సల్ సామర్ధ్యం గల హై‌డెఫినిషన్ వీడియోలాను మీకు అందిస్తుంది. 2జీబీ మైక్రో ఎస్డీ కార్ఢ్ ద్వారా జీబీని 32కు వృద్థి చేసుకోవచ్చు. సోని మ్యాజిక్ సర్వీస్ ఆప్లికేషన్ ద్వారా లక్షల సంఖ్యలో పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెలసరి చందా ద్వారా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot