‘సోని’ సరికొత్త ఆవిష్కరణ ‘3డీ బ్లూరే హోమ్ థియోటర్’..!!

Posted By: Super

‘సోని’ సరికొత్త ఆవిష్కరణ ‘3డీ బ్లూరే హోమ్ థియోటర్’..!!


‘‘ప్రతి సంవత్సరం విడుదలయ్యే ఎన్నో హిట్ చిత్రాలను బ్లూరే ఫార్మట్‌లో వీక్షించేందుకు సినీ ప్రేమికులు ఆసక్తి చూపుతుంటారు. బ్లూరే ఫార్మాట్‌లో సినిమా అనూభూతిని పొందాలంటే బ్లూ రే ప్లేయర్, బ్లూ రే హోమ్ థియోటర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్లూరే ప్రేమికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘సోని’ 3 సరికొత్త ‘3డీ బ్లూరే’ మ్యూజిక్ పరికరాలను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. సోని BDV-E980, సోని BDV-E880, సోని BDP-S380 మోడళ్లలో విడుదల కాబోతున్న ఈ హోమ్ థియోటర్ పరికరాలు నాణ్యమైన ‘బ్లూరే’ అనుభూతిని కలిగిస్తాయి.’’

క్లుప్తంగా వీటి ఫీచర్లు:

- సోని BDV-E980 హోమ్ థియోటర్ పొడవైన నాలుగు టాల్‌బాయ్ స్పీకర్లను కలిగి ఉంటంది.
- మరో వైపు సోని BDV-E880 హోమ్ థియోటర్ రెండు పొడవైన టాల్‌బాయ్ స్పీకర్లను కలిగి ఉంటుంది.
- వాతవరణానికి తగ్గట్లుగా ఈ హోమ్ థియోటర్లు మ్యూజిక్‌ను విడుదల చేస్తాయి.
- 3డీ సౌండ్ సామర్ధ్యం కలిగిన ఈ హోమ్ థియోటర్లను హెచ్‌డి‌ఎమ్‌ఐ ఇన్‌పుట్ల ద్వారా ఇంటర్నెట్ వీడియోలకు అనుసంధానం చేసుకోవచ్చు.
- బ్లూరే ఆధారిత డీవీడీ, జెపెగ్, ఎంపీత్రీ, ఎమ్‌కే‌వీ, ఏవీఐ ఫార్మాట్లను ఈ పరికరాలు సపోర్టు చేస్తాయి.
- వైర్‌లెస్ ల్యాన్ ఆడాప్టర్ సాయంతో వై ఫై సౌలభ్యతను పొందవచ్చు.
- ఏర్పాటు చేసిన టాల్‌బాయ్ స్పీకర్లు మన్నికైన మ్యూజిక్‌ను నాణ్యమైన పిచ్‌లో శ్రోతకు అందిస్తాయి.
- చివరిగా వీటి ధరల విషయానికొస్తే సోని BDV-E980 ధర రూ.40,000, సోని BDV-E880 ధర రూ.30,000గా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot