‘ఎమ్‌డి‌ఆర్’ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌, ఇప్పుడు అతి తక్కువ ధరలో.!

Posted By: Staff

‘ఎమ్‌డి‌ఆర్’ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌, ఇప్పుడు అతి తక్కువ ధరలో.!


దిగ్గజ డిజిటల్ పరికరాల తయారీదారు ‘సోని’ భారతీయ వినయోగదారులకు దసరా కానుకగా అత్యాధునిక మ్యూజిక్ ‘హెడ్‌ఫోన్‌’ పరికరాన్ని, అతి తక్కువ ధరలో అందించేందుకు ప్రణాళికలు పూర్తి చేసింది. వైర్‌లెస్ ఆధారితంగా పనిచేసే ‘ఎమ్‌డి‌ఆర్’ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ను సోని సంస్ధ రూపొందిచింది. ఉన్నత ప్రమాణాలతో నిర్మించిబడిన ఈ హెడ్‌ఫోన్ ధర కేవలం రూ. 1,750 త్వరపడండి మరి..!!

క్లుప్తంగా ‘ఎమ్‌డి‌ఆర్’ హెడ్‌ఫోన్ ఫీచర్లు:

- హెడ్‌సెట్‌లో పొందుపరిచిన 30 mm డ్రైవ్ వ్యవస్థ నాణ్యమైన సంగీతాన్ని శ్రోతకు అందిస్తుంది.
- హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన నికాడ్ బ్యాటరీ వ్యవస్థ 34 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- బ్యాటరీని రిఛార్జ్ చేసుకునేందుకు ఏసీ ఆడాప్లర్‌ను హెడ్‌సెట్‌తో అదనంగా పొందవచ్చు.
- వైర్‌లెస్ వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ హెడ్‌సెట్ 24 అడుగుల ట్రాన్స్‌మిషన్ రేంజ్‌ను కలిగి ఉంటుంది.
- తక్కువ బరువతో రూపుదిద్దుకున్న ఈ హెడ్‌సెట్లు చెవులకు ఎటువంటి హాని తలపెట్టవు.
- ఆడియో నాణ్యతను మరింత పటిష్టపరచేందుకు సోని ఓ కొత్త వ్యవస్థను ఈ హెడ్‌సెట్‌లో ప్రవేశపెట్టింది. హెడ్‌సెట్ కుడి, ఎడమ జింగిల్స్‌లో ట్రాన్సిమిషన్ ఛానళ్లను ఏర్పాటు చేసింది.
- మల్టీపుల్ డివైజ్ సామర్ధ్యం కలిగిన టీవీలతో పాటు మినీ‌డిస్క్ ప్లేయర్లకు ఈ హెడ్‌సెట్లను అనుసంధానం చేసుకోవచ్చు.
- ఆటో‌పవర్, వాల్యూమ్ కంట్రోల్ వంటి అంశాలకు ప్రత్యేక బటన్లను హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting