సోని మ్యూజిక్ ప్లేయర్, వినండి.. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా !!

అత్యాధునిక సౌండ్ ఫీచర్లతో సోని ‘NWZ-A844’మ్యూజిక్ ప్లేయర్ ను మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ పరిమాణంలో రూపుదిద్దుకున్న, ఈ ‘మ్యాజిక్ ప్లేయర్ కమ్ వాక్ మెన్’ పరికరం అటు ఆడియోతో పాటు వీడియోకు ఉపకరిస్తుంది. దూర ప్రయాణ సందర్భాల్లో మీలో ఉత్తేజాన్ని రెట్టింపు చేసే ఈ గ్యాడ్జెట్ ‘29 గంటల’ పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుది.
క్లుప్తంగా ‘సోని NWZ-A844’ ఫీచర్లు:
- ఆడియో ఆప్షన్లతో పాటు వీడియో ఆప్షన్లను ప్లేయర్లో ఏర్పాటు చేశారు.
- ప్లేయర్ లో ఏర్పాటు చేసిన 7.1 CM డిస్ ప్లే, 400 x 240 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.
- ఎఫ్ ఎమ్ ట్యూనర్ వ్యవస్థను ప్లేయర్ లో ముందుగానే లోడ్ చేశారు.
- ఏర్పాటు చేసిన నాణ్యమైన సౌండ్ వ్యవస్థ ‘క్లియర్ బాస్, క్లియర్ స్టీరియో’అనుభూతిని శ్రోతకు పంచుతుంది.
- 1800 పాటలను గ్యాడ్జెట్ లో స్టోర్ చేసుకోవచ్చు.
- 120 గంటల రికార్డింగ్ సామర్ధ్యాన్ని ప్లేయర్లో కల్పించారు.
- ప్లేయర్లలో ఏర్పాటు చేసిన స్లైడ్ ఫంక్షనింగ్ వ్యవస్థ శ్రోతలను మరింత ఆకట్టుకుంటుంది.
- పాటలు, ఫోటోలతో పాటు వీడియోలను ప్లేయర్లో స్టోర్ చేసుకోవచ్చు.
-MP3, MPEG 4,AAC-LC ఆడియో బిట్ తదితర JPEG ఫైళ్లను సపోర్టు చేస్తుంది.
- ఇండియన్ మార్కెట్లో సోని ‘NWZ-A844’మ్యూజిక్ ప్లేయర్ ధర రూ. 6,900.


Click it and Unblock the Notifications








