ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని మరింత చేరువ చేసిన పోర్టుబల్ మీడియా ప్లేయర్ విప్లవం నలు దిశలా పాకింది. ‘వాక్ మెన్’ను పరిచయం చేసిన సోని ( Sony) మీడియా ప్లేయర్ రంగంలో క్రీయాశీలక మార్పులకు ఆజ్యం పోసింది. ఈ రంగంలో తన సామర్ధ్యాన్ని క్రమేపీ విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న సొగసరి బ్రాండ్ ‘సోని’ పాకెట్ సైజ్ మీడియా ప్లేయర్‌ను డిజైన్ చేసింది. ‘సోని NWZ-A866’గా విడుదలవుతున్న ఈ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్ సౌకర్యవంతమైన ఆడియో, వీడియో అనుభూతులను శ్రోతకు కలిగిస్తుంది. ఈ డివైజ్ సౌలభ్యతతో ఫుల్ లెంగ్త్ సినిమాలను మన్నికైన విజువల్ అనుభూతితో తిలకించవచ్చు. సంగీతాన్ని వినసొంపైన బాణిలో ఆస్వాదించవచ్చు.
‘సోని NWZ-A866’ ముఖ్య ఫీచర్లు:
* 32జీబి ఇంటర్నల్ మెమరీ,
* MP3, WAV,AAC,WMV ఫార్మాట్లలోని ఆడియో ఫైళ్లను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది,
* MPEG4, WMV ఫార్మాట్లలని వీడియో ఫైళ్లను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది,
* 2.8 అంగుళాల డిస్‌ప్లే,
* టచ్ స్ర్కీన్,
* మీడియా ఫైళ్లను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ‘సోని మీడియా గో’ సాఫ్ట్‌వేర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు,
* మరిన్ని ఉపయుక్తవమైన ఫీచర్లను డివైజ్‌లో లోడ్ చేశారు, ధర రూ.15,000.