షేకాడించే ‘సోని స్టీరియో’ హెడ్‌సెట్!!

Posted By: Staff

షేకాడించే ‘సోని స్టీరియో’ హెడ్‌సెట్!!


‘‘దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘సోని’ మ్యూజిక్ ప్రకంపనలతో షేకాడించే శక్తివంతమైన వైర్‌లైస్ స్టీరియో హెడ్‌సెట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇటీవల సోని విడుదుల చేసిన ‘ప్లే స్టేషన్ 3’కి ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. వీడియో గేమింగ్ వ్యవస్థలో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘సోని ప్లే స్టేషన్ 3’ పరికరాలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి."

క్లుప్తంగా సోని వైర్ లెస్ హెడ్ సెట్ ఫీచర్లు:

- హెడ్‌సెట్లలో పొందుపరిచిన విర్ట్యుల్ 7.1 సరౌండింగ్ సౌండ్ వ్యవస్థ నాణ్యమైన అవుట్‌పుట్‌ను శ్రోతకు అందిస్తుంది.
- వైర్‌లెస్ ఆధారితంగా ఈ హెడెసెట్లను ‘ప్లే స్లేషన్ 3’కి అనుసంధానం చేసుకోవచ్చు.
- అమర్చిన యూఎస్బీ పోర్టు వ్యవస్థ ద్వారా హెడ్‌సెట్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
- హెడ్‌సెట్లలో పొందుపరిచిన అత్యాధునిక వ్యవస్ద వాల్యూమ్‌ను ఎప్పటికప్పుడు నాణ్యమైన పిచ్‌లో ప్లే చేస్తుంది.
- హెడ్‌సెట్‌లో అమర్చిన ఆన్ స్క్రీన్, మైక్, మ్యూట్, పవర్ బుటన్ వంటి ఆప్షన్లు వినియోగదారుడికి ఎప్పటికప్పుడు హెడ్‌సెట్ పనితీరును తెలియబరుస్తాయి.
- హెడ్‌సెట్ పై ఏర్పాటు చేసిన చిన్ని చిన్న బుల్బులు ఛార్జింగ్ అయిపోతున్న సందర్భాల్లో హెచ్చరికులు జారీ చేస్తుంటాయి.
- ధియోటర్ అనుభూతిలో గేమిండ్ ఆడియోను ఈ హెడ్‌సెట్లు అందిస్తాయి.
- అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ వైర్‌లెస్ హెడ్‌సెట్ స్పీకర్లు ఇండియన్ మార్కెట్లో రూ.5000కు లభ్యమవుతున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot