సోని నుంచి మరో ‘బ్లాక్ బస్టర్’ఆడియో గ్యాడ్జెట్

Posted By: Staff

సోని నుంచి మరో ‘బ్లాక్ బస్టర్’ఆడియో గ్యాడ్జెట్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘సోని’ అభిమానులకు శుభవార్త. దిగ్గజ సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారైన ‘సోని’ నుంచి మరో బ్లాక్‌బస్టర్ ఆడియో గ్యాడ్జెట్‌ను విడుదల చేయుబోతుంది.

వైర్‌లెస్ టెక్నాలజీ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ‘సోని SA NS300’స్పీకర్‌ను, వై-ఫై ఆధారిత ఐపోడ్, ఐఫోన్లతో పాటు స్మార్ట్ ఫోన్లు ఇతర కంప్యూటింగ్ పరికరాలకు జత చేసుకోవచ్చు.

వైర్లతో ఏ మాత్రం పనిలేకుండా మన్నికైన మ్యూజిక్‌ను అందించే ఈ గ్యాడ్జెట్ ‘360’ డిగ్రీ ఫీచర్ సౌండ్ స్వభావం కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో ఆడియో నలుదిశలా వ్యాప్తి చెందుతుంది. పార్టీలతో పాటు ఇతర సందర్భాల్లో ఈ స్సీకర్లు మన్నికైన వినోదాన్ని పంచుతాయి.

కేవలం 450 గ్రాముల కలిగి ఉన్న ఈ ‘హోమ్ షేర్ నెట్‌వర్క్ స్పీకర్’ 100 Hz, 20 kHz ఫ్రీక్వెన్సీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. రిమోట్ కంట్రోల్ ఆధారితంగా స్పీకర్‌లోని అంశాలను నియంత్రించుకోవచ్చు.

అత్యాధునిక టెక్నాలజీతో ‘చిన్న వైర్‌లెస్ ఆడియో గ్యాడ్జెట్‌గా’ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘సోని SA NS300’ ధర రూ.7500 ఉండోచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot