మందు పాతర కాదు.. స్మార్ట్ ఫోన్ స్పీకరు..

Posted By: Staff

మందు పాతర కాదు.. స్మార్ట్ ఫోన్ స్పీకరు..

‘‘పై చిత్రంలో ఉన్నగుండ్రటి బంతిని చూసిన మందుపాతరనుకుంటే పొరపాటే.. మైనింగ్ బాంబ్ ఆకృతిలో కనిపిస్తున్న ఆ గుండ్రటి పరికరం, సోని తాజాగా రూపొందించిన ‘SRS BTV25’ 360 డిగ్రీల స్మార్ట్ ఫోన్ స్పీకర్ శబ్థాన్ని నలుమూలలకు సమాన రీతిలో వ్యాపంప చేస్తుంది.’’

దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీ దారు ‘సోని’ మరో నూతన ఆవిష్కరణకు జీవం పోసింది. తన వినూత్న ఆలోచనలకు మరింత సానపెట్టి ముందు చూపుతో స్మార్ట్ ఫోన్ స్పీకర్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. బంతి ఆకృతిలో స్మార్ట్ ఫోన్ స్పీకర్‌ను తయారు చేసి కొత్త ఒరవడికి నాంది పలికింది.

‘SRS BTV25’గా మీ ముందుకు రాబోతున్న ఈ స్పీకర్ 360 డిగ్రీల గుండ్రటి ఆకృతిలో ఉంటుంది. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీని ఈ స్పీకర్లో ప్రవేశపెట్టారు. గదిలో నలుమూలలకు శబ్ధాన్ని సమాన పరిమాణంలో వ్యాపింప చేసేందుకు ఈ స్పీకర్లో పొందుపరిచిన వ్యవస్థ ఉపకరిస్తుంది.

వైర్‌లెస్ ప్రక్రియ ద్వారా ఈ స్పీకర్‌ను మీ మ్యూజిక్ ప్లేయర్లకు అనుసంథానం చేసుకోవచ్చు. ఒక వేళ మీ మ్యూజిక్ ప్లేయర్లలో బ్లూటూత్ వ్యవస్థ లేకపోతే, స్పీకర్లో పొందుపరిచిన ఆడియో లైన్ ఇన్‌పుట్ ద్వారా మ్యూజిక్ ప్లేయర్‌కు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు.

రిమోట్ వ్యవస్థ ఆధారింతంగా ఈ స్పీకర్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌లో పొందుపరిచిన బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది. టాబ్లెట్ పరికరాలతో పాటు మ్యూజిక్ ప్లేయర్స్, ఐఫోన్స్, స్మార్ట్ ఫోన్‌లకు ఈ స్పీకర్‌ను అనుసంధానం చేసుకుని నాణ్యమైన సంగీతాన్ని మీరు వినవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting