పెన్‌డ్రైవ్ తరహాలో సోనీ వాక్‌మెన్..!!

Posted By: Prashanth

పెన్‌డ్రైవ్ తరహాలో సోనీ వాక్‌మెన్..!!

 

ఆడియో పరికరాల ఉత్పాదకత రంగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన ‘సోనీ’అత్యుత్తమ మ్యూజిక్ గ్యాడ్జెట్‌లను డిజైన్ చేసింది. మ్యూజిక్ ప్రపంచానికి వాక్‌మెన్ పరికరాన్ని పరిచయం చేసిన ఈ మోస్ట్ వాంటెడ్ తాజాగా యూఎస్బీ ఆధారిత పోర్టబుల్ ‘బి’సిరీస్ వాక్‌మెన్‌ను ఆవిష్కరించింది. జనవరి చివరిలో మార్కెట్‌లోకి రాబోతున్న ఈ అత్యుత్తమ సౌండ్ గ్యాడ్జెట్ పనితీరు అదేవిధంగా స్పెసిఫికేషన్స్:

* పెన్‌డ్రైవ్ సైజ్‌లో రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లో యూఎస్బీ పోర్టును ఏర్పాటు చేశారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర యూఎస్బీ డివైజ్‌లకు వాక్‌మెన్‌ను జత చేసుకోవచ్చు, బరువు 23 గ్రాములు,

* దుస్తులు లేదా బెల్ట్‌కు హుక్ చేసుకునే సౌలభ్యత,

* ఈ డివైజ్ 18 గంటలు నిరంతరాయంగా మ్యూజిక్ ప్లేబ్యాక్‌నందిస్తుంది,

* కేవలం 3 నిమిషాల ఛార్జ్‌తో 90 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చు,

* 2జీబి, 4జీబి వేరియంట్‌లలో ఈ పెన్‌డ్రైవ్ లభ్యమవుతుంది,

* మన్నికైన సౌండ్ టెక్నాలజిని వాక్‌మెన్‌లో నిక్షిప్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot