సోని మైక్రో హై-ఫై సిస్టం!!

Posted By: Staff

సోని మైక్రో హై-ఫై సిస్టం!!

 

అంతర్జాతీయ ఆడియో పరికరాల తయారీదారు ‘సోని’ భారతీయ మార్కెట్లో మైక్రో హై-ఫై సౌండ్ సిస్టంను ప్రవేశపెట్టింది. ‘WHG-SLK20D’ వర్షన్‌లో విడుదలైన ఈ ఆడియో గ్యాడ్జెట్ ధర రూ.20,000.

ఈ గ్యాడ్జెట్ డిజైనింగ్ విషయానికొస్తే ముందుభాగంలో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ ప్యానల్ (LCD panel) ప్లే అవుతున్న ట్రాక్ సంబంధిత సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. అదే విధంగా సిస్టంకు ఇరు వైపులా రెండు స్పీకర్లు అమర్చుకోవచ్చు. వాల్యుమ్ నియంత్రణ, ఫార్వార్డ్, బ్యాకవర్డ్, ఆన్-ఆఫ్ అంశాలకు సంబంధించి టచ్ బటన్ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. సిస్టంలో నిక్షిప్తం చేసిన సీడీ-డీవీడీ ప్లేయర్ వ్యవస్థ ద్వారా సీడీ, డీవీడీలలో స్టోర్ చేసుకున్న పాటలను ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్డీ కార్డ్ స్లాట్, యూఎస్బీ స్లాట్ అంశాలు ఇతర మ్యూజిక్ డివైజులను జత చేసుకునేందుకు దోహదపడతాయి. ఈ ఆడియో సిస్టంను హై డెఫినిషన్ సామర్ధ్యం గల టీవిలకు జత చేసుకోవచ్చు.

ముఖ్య ఫీచర్లు:

* WMA, MP3, AAC ఆడియో ఫార్మాట్లను సిస్టం సపోర్టచేస్తుంది. * MPEG-4, * DivX వీడియో ఫార్మాట్లను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. * ఇమేజ్ ప్లే బ్యాక్ సపోర్ట్ JPEG, * బాస్ బూస్టర్, * ఈక్యూ ప్రీసెట్స్, * సరౌండ్ వ్యవస్థలు,

* 40 mm ట్వీటర్ యూనిట్, * 130 mm వూఫర్, * 90Wx2 ఆర్‌ఎమ్ఎస్ పవర్ యూనిట్.

నిరుత్సాహపరిచే అంశాలు:

* లిమిటెడ్ వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్స్, * లిమిటెడ్ కనెక్టువిటీ, * చిన్నదైన ఎల్‌సీడీ స్క్రీన్, * అధిక ధర.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot